Ambajipeta Marriage Band OTT: అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

క‌ల‌ర్ ఫొటో, రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ వంటి సినిమాలతో హీరోగా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ అందుకున్నాడు సుహాస్‌. ఇదే కోవలో సుహాస్‌ హీరోగా నటించిన మరో చిత్రం అంబాజీపేట మ్యారేజిబ్యాండు. శివానీ నగరం హీరోయిన్‌గా నటించగా, ఫిదా ఫేమ్‌ శరణ్య సుహాస్ సోదరి పాత్రలో మెప్పించింది.

Ambajipeta Marriage Band OTT: అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Ambajipeta Marriage Band
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2024 | 7:40 PM

క‌ల‌ర్ ఫొటో, రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ వంటి సినిమాలతో హీరోగా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ అందుకున్నాడు సుహాస్‌. ఇదే కోవలో సుహాస్‌ హీరోగా నటించిన మరో చిత్రం అంబాజీపేట మ్యారేజిబ్యాండు. శివానీ నగరం హీరోయిన్‌గా నటించగా, ఫిదా ఫేమ్‌ శరణ్య సుహాస్ సోదరి పాత్రలో మెప్పించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌ ఇప్పటికే పది కోట్ల వసూళ్లకు చేరువగా వచ్చింది. దీంతో మొదటి వీకెండ్‌ లోనే సుహాస్‌ సినిమా లాభాల బాట పట్టేసింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో దుష్యంత్ క‌టికనేని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే థియేటర్లలో సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలు లేదా ఐదు వారాల తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి 8న లేదా మార్చి 15న సుహాస్‌ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలున్నాయని త ఎలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సినిమా కథేంటంటే..

కుల వివక్ష నేపథ్యానికి ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఓడించి డైరెక్టర్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను తెరకెక్కించాడు. నితిన్‌ ప్రసన్న, గాయత్రి భార్గవి, గోపరాజు రమణ, జగదీష్‌ ప్రతాఫ్‌ భండారి, వినయ్‌ మహదేవ్‌, దివ్యా చలం శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో మల్లి అనే వెనకబడిన కులానికి చెందిన యువకుడి పాత్రలో నటించాడు సుహాస్‌. శేఖర్‌ చంద్ర అందించిన పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. కుల‌వివ‌క్ష‌కు ల‌వ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఇందులో మ‌ల్లి అనే నిమ్న వ‌ర్గానికి చెందిన యువ‌కుడిగా సుహాస్‌ నటించాడు. అతనుఅంబాజిపేట మ్యారేజి బ్యాండులో మెంబర్‌గా ఉంటాడు. అతని సోద‌రి ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) ఊరిలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంటుంది. అయితే ఆ ఊరిపెద్ద‌గా చెలామ‌ణి అవుతోన్న వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌)తో ప‌ద్మ గొడ‌వ‌ప‌డుతుంది. దీంతో పద్మ, మల్లిల జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. అక్కకు జరిగిన అన్యాయంపై మల్లి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? వెంకట్‌ బాబును ఎదరించి అతని చెల్లెలిని ఎలా పెళ్లి చేసుకున్నాడన్నదే ఈ మూవీ కథ.

ఇవి కూడా చదవండి

&

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.nbsp;