AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఇంగ్లండ్‌ తో మూడో టెస్టుకు బుమ్రా దూరం.. కారణమిదే

క్రికెట్‌ అభిమానులకు షాక్‌.. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించిన వైస్ కెప్టెన్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో ఆడడం లేదని తెలుస్తోంది. రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే ఈ కీలకమైన మ్యాచ్ లో బుమ్రాను దూరం పెట్టినట్లు సమాచారం.

IND vs ENG: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఇంగ్లండ్‌ తో మూడో టెస్టుకు బుమ్రా దూరం.. కారణమిదే
Team India
Basha Shek
|

Updated on: Feb 05, 2024 | 9:51 PM

Share

క్రికెట్‌ అభిమానులకు షాక్‌.. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించిన వైస్ కెప్టెన్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో ఆడడం లేదని తెలుస్తోంది. రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే ఈ కీలకమైన మ్యాచ్ లో బుమ్రాను దూరం పెట్టినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌ లు ఆడుతున్న విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే విశాఖ పిచ్‌పై కూడా తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టు వెన్నెముకను బుమ్రా విరిచాడు. ఆ తర్వాత మ్యాచ్ నాలుగో రోజు బుమ్రా మ్యాజిక్ చేసి 3 వికెట్లు పడగొట్టగలిగాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ విజయ ఆశలకు బుమ్రా పెద్ద బ్రేక్‌ వేశాడు. ఆపై వికెట్ కీపర్ బ్యాటర్‌ బెన్ ఫాక్స్ వికెట్‌ను పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ జట్టు చివరి వికెట్ ను తీసి భారత్‌ గెలుపును ఖరారు చేశాడు.

అయితే ఇప్పుడు సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టు నుంచి బుమ్రాకు విశ్రాంతినివ్వవచ్చని క్రిక్‌బజ్ నివేదించింది. నిజానికి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మ్యాచ్‌ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందనే భయం నెలకొంది. కాబట్టి చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్‌ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. అంతే కాదు, తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ తదుపరి టెస్టులో టీమ్ ఇండియా లీడింగ్ పేసర్‌గా కనిపించే అవకాశం ఉంది. రెండో టెస్టు నుంచి సిరాజ్‌కు విశ్రాంతి లభించగా, మూడో టెస్టుకు సిరాజ్ జట్టులోకి రావడం ఖాయం. అలాగే ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?