AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: అందుకే రోహిత్‌ను కాదని హార్దిక్‌కు ముంబై కెప్టెన్సీ అప్పగించాం.. అసలు విషయం చెప్పేసిన హెడ్‌ కోచ్‌

ముంబై ఇండియన్స్ ట్రేడ్ విండో ద్వారా జట్టు బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అయితే రోహిత్ శర్మను సారథ్యం నుంచి తొలగించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీని వెనక గల కారణాన్ని యాజమాన్యం చెప్పుకొచ్చినా హిట్ మ్యాన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పటికీ ముంబైపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఇదే విషయంపై నోరు విప్పాడు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.

IPL 2024: అందుకే రోహిత్‌ను కాదని హార్దిక్‌కు ముంబై కెప్టెన్సీ అప్పగించాం.. అసలు విషయం చెప్పేసిన హెడ్‌ కోచ్‌
Hardik Pandya, Rohit Sharma
Basha Shek
|

Updated on: Feb 06, 2024 | 12:53 PM

Share

ఐపీఎల్ 2024 టోర్నీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీ కోసం పది టీమ్‌లు సిద్ధ మవుతున్నాయి. టోర్నీ సన్నద్ధతలో భాగంగా మినీ వేలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆటగాళ్లను తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ ట్రేడ్ విండో ద్వారా జట్టు బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అయితే రోహిత్ శర్మను సారథ్యం నుంచి తొలగించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీని వెనక గల కారణాన్ని యాజమాన్యం చెప్పుకొచ్చినా హిట్ మ్యాన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పటికీ ముంబైపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఇదే విషయంపై నోరు విప్పాడు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్. రోహిత్‌ శర్మను కాదని ముంబై కెప్టెన్సీ బాధ్యతలను హార్ధిక్‌ పాండ్యాకు అప్పగించడానికి గల అసలు కారణాన్ని బౌచర్‌ వెల్లడించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం, ఇది పూర్తిగా క్రికెట్ నిర్ణయం. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకునే మార్గం కూడా మనం చూశాం. ఇది జట్టు భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం. భారతదేశంలో చాలా మందికి ఇది అర్థం కాలేదు. ప్రజలు చాలా ఎమోషనల్‌గా తీసుకున్నారు. కానీ కొన్నిసార్లు భావోద్వేగాలను దూరంగా ఉంచడం అవసరం. ఇది క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం మాత్రమేనని నేను భావిస్తున్నాను. ఆటగాడిగా రోహిత్ శర్మ ఎంతో గొప్పవాడు. మైదానంలో అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ మంచి పరుగులు చేయనివ్వండి’ అని ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు.

‘రోహిత్ శర్మది చాలా మంచి వ్యక్తిత్వం. అతను గత కొన్నేళ్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పుడు భారత్‌కు కూడా అతనే నాయకత్వం వహిస్తున్నారు. అతను చాలా బిజీ బిజీగా ఉంటున్నాడు. గత కొన్ని సీజన్లలో రోహిత్‌ పెద్దగా పరుగులు చేయలేదు. కానీ కెప్టెన్‌గా మాత్రం అమోఘంగా రాణిస్తున్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా అతడిపై భారీ బాధ్యతలు ఉన్నాయి. అయితే ఐపీఎల్‌లో ఆడే సమయంలో రోహిత్‌ భుజాలపై ఈ బాధ్యత ఉండకూడదనుకున్నాం. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటను చూసే అవకాశం మీకు లభిస్తుంది. అతను ముంబై ఇండియన్స్‌తో హ్యాపీగా ఆడుతున్నాడని నేను చూడాలనుకుంటున్నాను’ అని మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

స్వేచ్చగా ఆడేందుకే తప్పించాం

ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ వ్యవహారానికి తెర తీస్తున్నారు. దీని వెనుక అసలు కారణాన్ని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ చెప్పాడు. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్, ‘రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌ను ఆస్వాదించాలి, అందుకే అతన్ని కెప్టెన్సీ నుండి తొలగించారు’ అని చెప్పాడు. మార్క్ బౌచర్ స్మాష్ పోడ్‌కాస్ట్‌లో దీనికి నిజమైన కారణాలను వివరించాడు.

IPL 2024 కోసం ముంబై ఇండియన్స్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రూయిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్. చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్, హార్దిక్ పాండ్యా, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార, మహ్మద్ నబీ, శివలిక్ శర్మ.

రోహిత్ ఫ్యామిలీతో తిలక్ వర్మ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.