- Telugu News Photo Gallery Cricket photos Interesting Facts About James Anderson And His Wife Meet Model Daniella Lloyd, Photos
41 ఏళ్ల వయసులోనూ రఫ్పాడిస్తోన్న అండర్సన్ భార్యా, పిల్లలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో?
జేమ్స్ అండర్సన్.. క్రికెట్ లవర్స్‌కు ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు. 41 ఏళ్ల వయసులోనూ తన స్వింగ్ బౌలింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడీ ఇంగ్లండ్ పేసర్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పిటికే ఎన్నో రికార్డులు అందుకున్న జిమ్మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి అతని భార్య, పిల్లలెవరు? వారేం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.
Updated on: Feb 06, 2024 | 7:17 PM

జేమ్స్ అండర్సన్.. క్రికెట్ లవర్స్‌కు ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు. 41 ఏళ్ల వయసులోనూ తన స్వింగ్ బౌలింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడీ ఇంగ్లండ్ పేసర్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పిటికే ఎన్నో రికార్డులు అందుకున్న జిమ్మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి అతని భార్య, పిల్లలెవరు? వారేం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మైదానంలో చాలా దూకుడుగా కనిపిస్తాడు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. విశ్రాంతి దొరికినప్పుడల్లా ఎక్కువగా ఇంట్లోనే గడిపేందుకు ప్రయత్నిస్తాడు

జేమ్స్ అండర్సన్ భార్య పేరు డేనియెల్లా లాయిడ్. వీరిది ప్రేమ వివాహం. ప్రముఖ మోడల్ అయిన డేనియెల్లాను 2004లో మొదట కలుసుకున్నారు అండర్సన్. ఇద్దరి అభిరుచులు, మనసులు, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

డానియెల్లా , జేమ్స్ అండర్సన్ 2006లో హెలెనాలోని హోలీ ఏంజెల్స్ ఆర్‌సీ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2009 జనవరి 8న లోలా రోజ్ అనే కుమార్తె జన్మించింది.

ఆ మరుసటి ఏడాది అంటే 2010 డిసెంబర్ 9న రూబీ లక్స్ అనే రెండో కూతురు అండర్సన్- డేనియల్‌ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.