IND VS ENG: దెబ్బకు దెబ్బ.. బెన్ స్టోక్స్‌కు దిమ్మతిరిగే స్ట్రోక్‌ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్ .. వీడియో

శ్రేయాస్‌ అయ్యర్‌ అద్భుత ఫీల్డింగ్‌ కూడా ఈ మ్యాచ్‌కు కీలక మలుపు. ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్‌ అత్యుత్తమ క్యాచ్‌ అందుకున్నాడు. 76 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రాలీ కొట్టిన బంతిని శ్రేయాస్ అయ్యర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ను శ్రేయాస్ అయ్యర్ రనౌట్ చేశాడు

IND VS ENG: దెబ్బకు దెబ్బ.. బెన్ స్టోక్స్‌కు  దిమ్మతిరిగే స్ట్రోక్‌ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్ .. వీడియో
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2024 | 7:39 PM

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీనికి ముందు భారత్‌తో జరిగిన హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇప్పుడు వైజాగ్‌ టెస్టులో గెలిచి ఇంగ్లిష్ జట్టు మీద బదులు తీర్చుకుంది భారత జట్టు. శ్రేయాస్‌ అయ్యర్‌ అద్భుత ఫీల్డింగ్‌ కూడా ఈ మ్యాచ్‌కు కీలక మలుపు. ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్‌ అత్యుత్తమ క్యాచ్‌ అందుకున్నాడు. 76 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రాలీ కొట్టిన బంతిని శ్రేయాస్ అయ్యర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ను శ్రేయాస్ అయ్యర్ రనౌట్ చేశాడు. బెన్ ఫాక్స్ బంతిని ముందు ఫీల్డర్‌కి కొట్టి పరుగెత్తాడు. బెన్ స్టోక్స్ నాన్ స్ట్రైకర్ వైపు నుంచి పరుగెత్తుకుంటూ క్రీజులోకి రాకముందే శ్రేయాస్ అయ్యర్ బంతిని వికెట్ వద్దకు విసిరి టీమ్ ఇండియా విజయానికి బాటలు వేశాడు.

కాగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ బాగానే ఆడాడు. అయితే భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. 28వ ఓవర్ తొలి బంతిని లాంగ్ ఆన్‌లో కొట్టిన అయ్యర్‌ బెన్ స్టోక్స్ చేతికి చిక్కాడు. 30 గజాల సర్కిల్‌ నుంచి పరుగెత్తిన స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ని అందుకొని ప్రేక్షకులకు ఔటంటూ వేలు చూపించాడు. దీనికి తగిన బదులు తీర్చుకున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. రెండో ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్‌ను రనౌట్ చేసిన అయ్యర్ కూడా అదే పద్ధతిలో వేలు చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

బెన్ స్టోక్స్ సెలబ్రేషన్స్ వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..