- Telugu News Photo Gallery Cinema photos Singer Geetha Madhuri Udaka Pooja And Baby Shower Ceremony photos
Geetha Madhuri: గీతా మాధురి ఇంట్లో ఉదకశాంతి పూజ.. గ్రాండ్ గా సీమంతం.. ఫొటోలు చూశారా?
టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి, నటుటు నందు దంపతుల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వీరు త్వరలోనే మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. గీతా మాధురి రెండోసారి గర్భం ధరించింది. ఫిబ్రవరిలోనే ఆమె డెలివరీ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.
Updated on: Feb 04, 2024 | 6:55 PM

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి, నటుటు నందు దంపతుల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వీరు త్వరలోనే మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. గీతా మాధురి రెండోసారి గర్భం ధరించింది. ఫిబ్రవరిలోనే ఆమె డెలివరీ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.

తాజాగా గీతా మాధురి, నందుల ఇంట్లో సీమంత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అంతా మంచే జరగాలని ప్రత్యేకంగా ఉదక పూజలు కూడా నిర్వహించారు గీతా మాధురి దంపతులు.

ఇక సీమంతం వేడుకల్లో కూతురు దాక్షాయని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రస్తుతం గీతా మాధురి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ ఫ్యామిలీ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గీత, నందూలది ప్రేమ వివాహం. 2014లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. తమ ప్రేమ, అన్యోన్యత బంధానికి ప్రతీకగా 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది.

ఇప్పుడు మరో పాపాయి గీత, నందుల జీవితంలోకి రానుంది. తాను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని డిసెంబర్‌లో అందరితో పంచుకుంది గీత. అలాగే ఫిబ్రవరిలో దాక్షాయని అక్క కానుందంటూ తెలిపింది.