Black OTT: థియేటర్లలో రిలీజైన 19 ఏళ్లకు ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అమితాబ్ బచ్చన్ తన కెరీర్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అభిమానులను అలరించేందుకు కమర్షియల్ సినిమాలు చేశాడు. అలాగే ఎన్నో ప్రయోగాలు కూడా చేశాడు. గత 5 దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తోన్న అమితాబ్ కెరీర్‌లో మరుపురాని చిత్రం
అమితాబ్ బచ్చన్ తన కెరీర్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అభిమానులను అలరించేందుకు కమర్షియల్ సినిమాలు చేశాడు. అలాగే ఎన్నో ప్రయోగాలు కూడా చేశాడు. గత 5 దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తోన్న అమితాబ్ కెరీర్‌లో మరుపురాని చిత్రం బ్లాక్. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. పలు పురస్కారాలు కూడా గెల్చుకుంది. 2005 ఫిబ్రవరి 04న బ్లాక్ సినిమా థియేటర్లలో విడుదలైంది. అంటే ఈ సినిమా రిలీజై 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఇదే తేదీన ఫిబ్రవరి 04 (ఆదివారం) బ్లాక్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ‘సంజయ్ లీలా బన్సాలీ బ్లాక్ థియేటర్లలోకి వచ్చి 19 సంవత్సరాలు. ఇప్పుడు తొలిసారిగా ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. ఈ చిత్రంలో మీరు మరోసారి దేబ్రాజ్ (అమితాబ్ బచ్చన్) ,మిచెల్ (రాణీ ముఖర్జీ)ల ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఈ సినిమా మీకు మరింత బలాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేసింది నెట్ ఫ్లిక్స్. .
బ్లాక్ సినిమాలో దేబ్రాజ్ అనే టీచర్ రోల్లో అమితాబ్ ఆకట్టుకున్నారు. ఇందులో బిగ్ బీ నటనకు గానూ జాతీయ అవార్డు రావడం విశేషం. ఇక అంధురాలు మిచెల్ పాత్రలో రాణీ ముఖర్జీ అభినయం అద్భుతం. అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్, నందన సేన్ , ధృతిమాన్ ఛటర్జీతో సహా పలువురు ప్రముఖ తారలు ఇందులో నటించారు. ఈ చిత్రం 3 విభాగాల్లో ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’, 11 విభాగాల్లో ‘ఫిల్మ్‌ఫేర్’, 9 విభాగాల్లో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం.
It’s been 19 years since Sanjay Leela Bhansali’s Black released, and today we’re celebrating it’s first ever digital release on Netflix! Debraj and Michelle’s journey has been an inspiration to all of us, and we hope it instills you with strength and compassion ❤️… pic.twitter.com/PfJnqHQ5V4
— Netflix India (@NetflixIndia) February 4, 2024
T 4910 – It’s been 19 years since Black released, and today we’re celebrating it’s first ever digital release on Netflix!
Debraj and Michelle’s journey has been an inspiration to all of us, and we hope it instills you with strength and compassion ❤️#SanjayLeelaBhansali… pic.twitter.com/tkJCzivFBt
— Amitabh Bachchan (@SrBachchan) February 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.