AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukku Avinash: ‘జై అవినాష్ అన్నా’.. వైన్‌ షాపు దగ్గర ఫ్రీగా మందు పంచిన స్టార్‌ కమెడియన్‌.. మందుబాబుల ఎమోషనల్‌

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ యంగ్‌ హీరో సయ్యద్‌ సోహైల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. ఇందులో జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్ ఒక కీలక పాత్రలో నటించాడు. శ్రీ కోనేటి దర్శకత్వం వహించినఈ చిత్రానికి

Mukku Avinash: 'జై అవినాష్ అన్నా'.. వైన్‌ షాపు దగ్గర ఫ్రీగా మందు పంచిన స్టార్‌ కమెడియన్‌.. మందుబాబుల ఎమోషనల్‌
Mukku Avinash
Basha Shek
|

Updated on: Feb 03, 2024 | 6:50 PM

Share

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ యంగ్‌ హీరో సయ్యద్‌ సోహైల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. ఇందులో జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్ ఒక కీలక పాత్రలో నటించాడు. శ్రీ కోనేటి దర్శకత్వం వహించినఈ చిత్రానికి ఎం.డి.పాషా నిర్మాత కాగా.. హీరో సోహైల్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 02) థియేటర్లలో విడుదలైన బూట్‌ కట్‌ బాలరాజు పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వెరైటీగా ప్రమోషన్స్‌ నిర్వహించాడు కమెడియన్‌ ముక్కు అవినాష్‌. తన స్నేహితులతో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా చూడాలని ప్రచారం నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఓ వైన్‌ షాపు దగ్గరకు వెళ్లిన అవినాష్‌ అక్కడున్న మందు బాబుల్ని తనకూ 90 ఎంఎల్‌ మందు బాటిల్‌ ఇప్పించాలని అడిగాడు. తన దగ్గర డబ్బుల్లేవని.. అయితే మందు తాగాలని ఉందని నాకు ఒక 90 ఇప్పించండని మందు బాబుల్ని అడిగాడు. దీంతో చాలామంది అతనికి మందు పోయించడానికి పోటీ పడ్డారు. నేను ఇప్పిస్తానంటే నేను ఇప్పిస్తానంటూ చాలా మంది పోటీ పడ్డారు.

అయితే ఇక్కడే ట్విస్ట్‌ ఇచ్చాడు అవినాష్‌. రివర్స్‌లో తానే మందుబాబులకు 90 ఎం ఎల్‌ బాటిల్స్ పంచి పెట్టాడు. దీంతో మందుబాబుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ‘జై అవినాష్‌ అన్నా’.. నువ్వు దేవుడి సామీ’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు మందు బాబులు. ఆ తర్వాత తన ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా చూడాలని కోరాడు అవినాష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. బూట్ కట్‌ బాలరాజు సినిమాలో మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు సోహైల్‌. సినిమా ప్రమోషన్స్‌ బాధ్యతలను తన భుజాన వేసుకుని మరీ మూవీని జనాల్లోకి తీసుకెళుతున్నాడు.

ఇవి కూడా చదవండి

సోహైల్ స్నేహితుడిగా కీలక పాత్రలో

వెరైటీ గా మూవీ ప్రమోషన్లు..

గంగవ్వతో బూట్ కట్ బాలరాజు బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..