Joram OTT: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్‌ మూవీ.. మనోజ్‌ బాజ్‌ పాయ్ ‘జొరమ్‌’ ఎక్కడ చూడొచ్చంటే?

నోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా జొరమ్‌. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే అంతకంటే ముందే విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సర్వైవల్‌ థ్రిల్లర్‌. సిడ్నీ, డర్బన్, షికాగో, ఎడిన్‌బరో లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జొరమ్‌ సినిమాను ప్రదర్శించారు.

Joram OTT: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్‌ మూవీ.. మనోజ్‌ బాజ్‌ పాయ్ 'జొరమ్‌' ఎక్కడ చూడొచ్చంటే?
Joram Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2024 | 7:56 PM

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైపోయాడు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌ పాయ్‌. దీని తర్వాత మనోజ్‌ నటించిన ‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’, ‘ ది కిల్లర్‌ సూప్‌’ తదితర సినిమాలు, సిరీస్‌లు కూడా తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇదే కోవలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా జొరమ్‌. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే అంతకంటే ముందే విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సర్వైవల్‌ థ్రిల్లర్‌. సిడ్నీ, డర్బన్, షికాగో, ఎడిన్‌బరో లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జొరమ్‌ సినిమాను ప్రదర్శించారు. అలానే బెస్ట్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ తదితర విభాగాల్లో అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా ఫిలింఫేర్-2024 పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా సొంతం చేసుకుంది జొరమ్‌. ఇలా ఎన్నో అవార్డులు గెల్చుకున్న ఈ సూపర్‌ హిట్‌ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో జొరమ్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 02) అర్ధ రాత్రి నుంచే జొరమ్‌ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ప్రస్తుతం కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చింది జొరమ్‌. అది కూడా రెంట్‌ విధానంలో మాత్రమే. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా ఓటీటీలోకి రావొచ్చని తెలుస్తోంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఝార్ఖండ్ అడవుల్లో నివసించే దస్రు-వాను అనే గిరిజన జంటకు జొరమ్ అనే మూడు నెలల కూతురు ఉంటుంది. సొంత గ్రామంలో పనుల్లేక పోవడంతో పొట్టచేత పట్టుకుని ముంబై వస్తారు. రోజువారీ కూలీగా పనికి చేరుతాడు. అయితే తన కుమారుడిని దస్రు చంపేశాడని, అతని కోసం ముంబైకు వస్తుంది అతని భార్య. దీంతో కూతురితో ముంబై వదిలి సొంతూరికి పారిపోతాడు. ఈ ప్రయాణంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నదే జొరమ్‌ కథ. వీకెండ్‌లో మంచి థ్రిల్లర్‌ సినిమా చూడాలనుకునేవారికి జొరమ్‌ మంచి చాయిస్‌.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉల్లికాడలు రుచి కోసం మాత్రమే కాదు.. వీటితో లెక్కలేనన్ని లాభాలు!
ఉల్లికాడలు రుచి కోసం మాత్రమే కాదు.. వీటితో లెక్కలేనన్ని లాభాలు!
తెలంగాణ టెట్‌ 2024 పూర్తి షెడ్యూల్‌ విడుదల.. 14 రోజుల్లో పరీక్షలు
తెలంగాణ టెట్‌ 2024 పూర్తి షెడ్యూల్‌ విడుదల.. 14 రోజుల్లో పరీక్షలు
స్టేషన్ మాస్టర్‌కు అతి విశిష్ట రైలు సేవా పురస్కార్.. ఎందుకంటే
స్టేషన్ మాస్టర్‌కు అతి విశిష్ట రైలు సేవా పురస్కార్.. ఎందుకంటే
దృశ్యం సినిమాను తలపించేలా సీన్..!
దృశ్యం సినిమాను తలపించేలా సీన్..!
సిద్ధు జొన్న‌లగ‌డ్డ జాక్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ సినిమా వాయిదా?
సిద్ధు జొన్న‌లగ‌డ్డ జాక్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ సినిమా వాయిదా?
అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు.?
అంబానీ ఆస్తుల నుంచి కృతి సనన్ ఎత్తు వరకు.?
బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్ నాతో చెప్పింది ఇదే..
బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్ నాతో చెప్పింది ఇదే..
తులసిని తాకడానికి, తులసీ దళాలు కోయడానికి నియమాలున్నాయని తెలుసా
తులసిని తాకడానికి, తులసీ దళాలు కోయడానికి నియమాలున్నాయని తెలుసా
డా బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో BEd ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
డా బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో BEd ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాల్సింది.. అనుకోకుండా స్టార్ హీరోయిన్
ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాల్సింది.. అనుకోకుండా స్టార్ హీరోయిన్