Captain Miller OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా మెప్పించగా, తెలుగు నటుడు సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ సూపర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా మెప్పించగా, తెలుగు నటుడు సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ సూపర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగులో రిలీజ్ ఆలస్యమైంది. రెండు వారాలు ఆలస్యంగా గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న ధనుష్ సినిమా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్‌తో ఓ మోస్తారు వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న కెప్టెన్ మిల్లర్ త్వరలోనే ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ధనుష్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచే కెప్టెన్ మిల్లర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఒకే రోజే ధనుష్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన కెప్టెన మిల్లర్ అదితి బాలన్, ఎడ్వర్ట్ సొనెన్‍బ్లిక్, జాన్ కొక్కెన్, నివేదిత సతీశ్, వినోద్ కిషన్, ఎలెక్సో ఓనెల్ కీలకపాత్రల్లో నటించారు. త్య జ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ నిర్మించిన ఈమూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. భారత స్వాతంత్య్రానికి కంటే ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో కెప్టెన్ మిల్లర్ మూవీ రూపొందింది. యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయని టాక్ వచ్చింది. మరి థియేటర్లలో ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
what makes a soldier go rogue? the answer lies in Miller’s journey#CaptainMillerOnPrime, Feb 9 @dhanushkraja @priyankaamohan @ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @SathyaJyothi pic.twitter.com/EknEyYNW7O
— prime video IN (@PrimeVideoIN) February 2, 2024
కీలక పాత్రలో మెరిసిన సందీప్ కిషన్..
3️⃣ Days To Go For #CaptainMillerTelugu in theatres On January 26th🔥
Trailer ▶️ https://t.co/gHBLBICzmK
Grand Telugu Release By @AsianCinemas_ and @SureshProdns 💥@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/fDMPn7BSLS
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








