AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pindam OTT: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ సినిమా ‘పిండం’.. చూసి భయపడకుండా ఉండగలరా ?..

ఇటీవల కాలంలో వచ్చిన ఓ సినిమా మాత్రం థియేటర్లలో జనాలను భయంతో వణికించింది. విడుదలకు ముందే గర్బిణీ స్త్రీలు మా సినిమా చూడొద్దు అంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 'పిండం' పేరుకు తగ్గట్టే కథ కూడా విభిన్నంగా సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీలో శ్రీరామ్ , 'దియా' ఫేమ్ ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించగా.. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు.

Pindam OTT: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ సినిమా 'పిండం'.. చూసి భయపడకుండా ఉండగలరా ?..
Pindam Ott
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2024 | 3:09 PM

Share

రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్స్ కాదు.. ఇప్పుడంతా హారర్ సినిమాలే.. సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రాలు చూసేందుకు అడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్ బలంగా ఉండి.. ట్విస్టులుంటే చాలు హిట్ అయ్యినట్లే. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ఓ సినిమా మాత్రం థియేటర్లలో జనాలను భయంతో వణికించింది. విడుదలకు ముందే గర్బిణీ స్త్రీలు మా సినిమా చూడొద్దు అంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘పిండం’ పేరుకు తగ్గట్టే కథ కూడా విభిన్నంగా సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీలో శ్రీరామ్ , ‘దియా’ ఫేమ్ ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించగా.. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. టీజర్, ట్రైలర్‏తోనే క్యూరియాసిటిని కలిగించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 15న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మసూద, విరూపాక్ష చిత్రాల తర్వాత ఆ రేంజ్ రెస్పాన్స్ అందుకుని మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

‘పిండం’ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలో ఈ హారర్ మూవీ చూసేందుకు భయపడినవారు ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. 1930, 1990, ప్రస్తుతం ఇలా మూడు కాలాల్లో జరిగిన కథలే ఈ సినిమా. నల్గొండ జిల్లాల్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని దాని చుట్టూ ఓ కల్పిత కథాంశం అల్లుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇక ‘పిండం’ కథేంటంటే..

ఈశ్వరీ రావు అన్నమ్మ పాత్రలో నటించింది. తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక జ్ఞానంతో ఆత్మలు ఆవహించినవారిని రక్షిస్తుంది. అయితే అదే సమయంలోనే తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్) ఆమె వద్దకు వస్తాడు. ఆత్మల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న అతడికి అన్నమ్మ.. 1990లో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతుంది. రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పనిచేసే ఆంథోని (శ్రీరామ్).. తన భార్య మేరీ (ఖుషి రవి), పిల్లలు సోఫి, తారలతో కలిసి ఊరి చివర ఉండే ఇంట్లోకి వస్తారు. అయితే అదే ఇంట్లో ఉండే ఆత్మలు.. ఆంథోని కుటుంబాన్ని వేధిస్తాయి. గర్భంతో ఉన్న మేరీని మినహా.. అందరిని ఆవహించి ఇబ్బందులకు గురిచేస్తాయి. చివరకు ఆత్మల నుంచి ఆంథోని కుటుంబం ఎలా బయటపడింది ?.. ఆ ఇంట్లో ఏం జరిగింది ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.