AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటిపై బురద పూసుకొని.. విచిత్రంగా పోజులిస్తోన్న ఈ గుంపులో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారా?

సినిమా ప్రమోషన్ కోసం సర్కస్ ఫీట్లు చేస్తుంటారు కొందరు స్టార్‌ హీరోలు. ఎలాగైనా తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నది ఆ హీరోల తపన. ఇందుకోసం ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకుంటారు. అందుకు ఈ ఫోటో బెస్ట్ ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఫోటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు

ఒంటిపై బురద పూసుకొని.. విచిత్రంగా పోజులిస్తోన్న ఈ గుంపులో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారా?
Viral Photo
Basha Shek
|

Updated on: Feb 02, 2024 | 4:30 PM

Share

సినిమా ప్రమోషన్ కోసం సర్కస్ ఫీట్లు చేస్తుంటారు కొందరు స్టార్‌ హీరోలు. ఎలాగైనా తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నది ఆ హీరోల తపన. ఇందుకోసం ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకుంటారు. అందుకు ఈ ఫోటో బెస్ట్ ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఫోటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఒంటిపై బురద పూసుకుని అసలే మాత్రం గుర్తుపట్టలేని రీతిలో మారిపోయారీ హీరోస్‌. పేరుకు బాలీవుడ్‌ హీరోలైనా వీరు మనకు కూడా బాగా సుపరిచితమే. మరి వారెవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మేమే సమాధానం చెబుతాం లెండి. వారు మరెవరో కాదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. నటీనటుల పేర్లు చెప్పిన తర్వాత కూడా ఈ ఫోటోలో ఎక్కడున్నారో కనిపెట్టడం కష్టమైన పని. ఎందుకంటే వారు పూర్తిగా బురద పూసుకుని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. కాబట్టి వారిని గుర్తించాలంటే ఎంతో నిశితంగా పరిశీలించాల్సిందే .

తీక్షణంగా చూస్తే ఫోటోలో ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి అక్షయ్ కుమార్. అతని ఎడమవైపు టైగర్ ష్రాఫ్ నిల్చున్నాడు. ఈ ఫోటోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. ‘బడే మియా చోటే మియా’ సినిమా షూటింగ్ సెట్స్‌లో క్లిక్‌ అయిన ఫోటో ఇది. ఈ ఫోటోను షేర్ చేస్తూ అక్షయ్ కుమార్ ఒక షెడ్యూల్‌ షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా ‘బడే మియా చోటే మియా’ సినిమా విడుదల కానుంది. ముంబై, లండన్, స్కాట్లాండ్, అబుదాబి, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు. ఈ సినిమా హిందీంతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

రంజాన్ పండగకు రిలీజ్..

తెలుగులోనూ రిలీజయ్యే ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి తెలుసా
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?