AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్‌ బిజినెస్‌ క్లోజ్.. సాయం చేస్తానంటూ ముందుకొచ్చిన టాలీవుడ్‌ హీరో

చుట్టు పక్కల ప్రాంతాల్లోని యువత ఎక్కువగా కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతుంది. ఈ ఫుడ్‌ స్టాల్‌కు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందంటూ పోలీసులు కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆమె బిజినెస్‌ను క్లోజ్‌చేయించారు. దీనిపై కుమారీ ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Kumari Aunty: కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్‌ బిజినెస్‌ క్లోజ్.. సాయం చేస్తానంటూ ముందుకొచ్చిన టాలీవుడ్‌ హీరో
Kumari Aunty, Sandeep Kishan
Basha Shek
|

Updated on: Jan 30, 2024 | 10:04 PM

Share

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది కుమారీ ఆంటీ. మాదాపూర్‌లోని ఐటీసీ కోహీనూర్‌ హోటల్‌ సమీపంలో స్ట్రీట్‌ ఫుడ్ బిజినెస్‌ చేస్తోన్న ఆమె గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. కుమారీ ఆంటీ ఫుడ్‌ బిజినెస్‌ రోజుకు లక్షల్లో సాగుతుందని ,సెలబ్రిటీలు సైతం ఆమె దగ్గరికి వచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు ఊదరగొట్టేశాయి. ఇక బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కథనాలు కూడా అల్లేశాయి. ఇలా గత కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ ఇప్పుడు కష్టాల్లో పడింది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని యువత ఎక్కువగా కుమారీ ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతుంది. ఈ ఫుడ్‌ స్టాల్‌కు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందంటూ పోలీసులు కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆమె బిజినెస్‌ను క్లోజ్‌చేయించారు. దీనిపై కుమారీ ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్‌ ప్రముఖ హీరో సందీప్‌ కిషన్‌ స్పందించారు. ‘సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకునే వారికి ఆమె ఆదర్శం. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారిత ఉదాహరణల్లో ఇది కూడా ఒకటి. నేను, నా టీమ్‌ తరఫున సాధ్యమైనంతవరకు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సందీప్‌ కిషన్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు కుమారీ ఆంటీ బిజినెస్‌ క్లోజ్‌ చేయించడంపై ట్రాఫిక్‌ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ‘ఈ మార్గంలో స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌కు ఎలాంటి అనుమతులు లేవు. ఇది వీరి సొంత స్థలం కాదు. ఈ బిజినెస్‌ కారణంగా చాలా కాలంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇక్కడకు వచ్చే వందమంది కారణంగా వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్యలు తీసుకోక తప్పలేదు’ అని స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ ఒకరు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కుమారీ ఆంటీకి మద్దతుగా సందీప్ కిషన్ ట్వీట్..

కుమారీ ఆంటీ స్టాల్ వద్ద భోజనం చేస్తోన్న సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.