AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman OTT: ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్ మారింది.. ఆ పండగకు స్ట్రీమింగ్‌ కానున్న లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌

థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఆడియెన్స్‌ సైతం హనుమాన్‌ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రూ.250 కోట్లను దాటేసి రూ. 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది.

Hanuman OTT: 'హనుమాన్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్ మారింది.. ఆ పండగకు స్ట్రీమింగ్‌ కానున్న లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌
Hanuman Movie
Basha Shek
|

Updated on: Jan 29, 2024 | 9:52 PM

Share

థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఆడియెన్స్‌ సైతం హనుమాన్‌ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రూ.250 కోట్లను దాటేసి రూ. 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయిక. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్ నటించి మెప్పించింది. స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కాన్సెప్ట్‌ మీద నమ్మకంతో మరీ సంక్రాంతికి రిలీజ్ చేశారు మేకర్స్‌. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది హనుమాన్‌. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న హనుమాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వైరల్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 హనుమాన్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఎప్పటిలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ నెల రోజుల తర్వాత సినిమాను ఓటీటీలోకి తీసుకొద్దామనుకున్నారు. అయితే ప్రస్తుతం థియేటర్ల వద్ద హనుమాన్‌ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఈ క్రమంలో థియేట్రికల్‌ రిలీజ్ పూర్తయిన 55 రోజుల తర్వాతే హనుమాన్‌ ను ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్‌. ఇందుకు జీ 5 ఓటీటీ సంస్థ కూడా ఒకే చెప్పినట్లు టాక్‌. అంటే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటలోకి స్ట్రీమింగ్‌కు రావచ్చన్నమాట.  అంటే సరిగ్గా శివరాత్ర పండగకు ఓటీటీలోకి రావచ్చని నెట్టింట టాక్ నడుస్తోంది. హనుమాన్‌ సినిమాలో వినయ్‌ రాయ్‌ స్టైలిష్ విలన్ గా మెరిశాడు. సముద్ర ఖని, జబర్దస్త్‌ శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

రూ. 250 కోట్ల క్లబ్ లో హనుమాన్..

సక్సెస్ మీట్ లో అమృతా అయ్యర్, వరలక్ష్మి..

తేజా సజ్జా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌