AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Saamiranga OTT: ‘నా సామిరంగ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ ?..

మొదటిరోజే రూ.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇందులో కన్నడ భామ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లర్ హీరోయిన్లుగా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, సైంధవ్ చిత్రాలతో పోటీ పడి మరీ బ్రేక్ ఈవెన్ సాధించింది. విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీతో మరోసారి నాగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.

Naa Saamiranga OTT: 'నా సామిరంగ' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ ?..
Naa Saamiranga
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2024 | 5:55 PM

Share

చాలా కాలం తర్వాత టాలీవుడ్ మన్మథుడి ఖాతాలో హిట్టు పడింది. ఘోస్ట్ మూవీ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన సినిమా ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈసారి పండక్కి ఫ్యామిలీ అడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించాడు నాగ్. మొదటిరోజే రూ.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇందులో కన్నడ భామ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లర్ హీరోయిన్లుగా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం, సైంధవ్ చిత్రాలతో పోటీ పడి మరీ బ్రేక్ ఈవెన్ సాధించింది. విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీతో మరోసారి నాగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. కామెడీ, మాస్, లవ్ స్టోరీ ఇలా అన్ని అంశాల్లోనూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది ఈ సినిమా. దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమిండ్ డేట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా ?.. అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా నా సామిరంగ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏరోజు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను వచ్చే నెలలో (ఫిబ్రవరి 15) నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. జనవరి 14న ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కంటెంట్ తోపాటు మ్యూజిక్ పరంగానూ ఆకట్టుకుంటుంది. విడుదలకు ముందే ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్ లో సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఈచిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. మలయాళీ సినిమాకు రీమేక్ చేసినా.. తెలుగు నెటివిటికి తగినట్లుగా ఈ మూవీని మార్చి రూపొందించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్