AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Soorya- Gopika: హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కిన ‘అల.. వైకుంఠపురం’ విలన్‌.. వీడియో వైరల్‌

ప్రముఖ మలయాళ నటుడు పద్మ సూర్య తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్‌ పాత్రలు పోషించే అతను నిజ జీవితంలో మాత్రం ఏకంగా హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కాడు. ఆదివారం (జనవరి 28) కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో నటుడు పద్మ సూర్య, హీరోయిన్ గోపికా అనిల్‌ల వివాహం అట్టహాసంగా జరిగింది

Padma Soorya- Gopika:  హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కిన 'అల.. వైకుంఠపురం' విలన్‌.. వీడియో వైరల్‌
Govind Padmasoorya, Gopika
Basha Shek
|

Updated on: Jan 28, 2024 | 2:32 PM

Share

ప్రముఖ మలయాళ నటుడు పద్మ సూర్య తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్‌ పాత్రలు పోషించే అతను నిజ జీవితంలో మాత్రం ఏకంగా హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కాడు. ఆదివారం (జనవరి 28) కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో నటుడు పద్మ సూర్య, హీరోయిన్ గోపికా అనిల్‌ల వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు సమక్షంలో గోపిక మెడలో మూడు ముళ్లు వేశాడు పద్మ సూర్య. వివాహం అనంతరం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోల్ని, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు. మలయాల సినిమాల్లో ఎక్కువగా కనిపించే పద్మ సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. అల్లు అర్జున్‌ ‘ అల వైకుంఠ పురం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు .అందులో విలన్‌ కుమారుడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగచైతన్య బంగార్రాజు, మీట్‌ క్యూట్‌,లైక్ షేర్ అండ్‌ సబ్‌స్క్రైబ్ తదితర తెలుగు సినిమాల్లో నెగెటివ్‌ రోల్స్‌తో అలరించాడు.

కేవలం సినిమాల్లోనే కాదు మలయాళంలో టీవీ షోలకు హోస్ట్‌గానూ సత్తా చాటుతున్నాడు పద్మ సూర్య. అంతే కాదు సొంత యూట్యుబ్​ ఛానల్​ ఇంట్రెస్టింగ్‌ కంటెంట్​ పోస్ట్​ చేస్తూ నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతున్నాడు. ఇక వధువు గోపిక విషయానికొస్తే.. పలు సూపర్‌ హిట్‌ సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకుంది. అయితే తమది పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పద్మ సూర్య. గతేడాది అక్టోబరులో వీరి నిశ్చితార్థం గ్రాండ్​గా జరిగింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడకకు హాజరయ్యారు. తాజగా పెళ్లితో ఏకమయ్యారు పద్మ సూర్య, గోపిక. మరి ఎంతో అట్టహాసంగా జరిగిన వీరి పెళ్లి వీడియలు మనమూ చూసేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

పద్మ సూర్య, గోపికల పెళ్ల వీడియోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..