Vijayakanth: మరణం తర్వాత ప్రతిష్ఠాత్మక అవార్డ్‌.! స్టార్ హీరో ఫ్యాన్స్‌ ఎమోషనల్.

Vijayakanth: మరణం తర్వాత ప్రతిష్ఠాత్మక అవార్డ్‌.! స్టార్ హీరో ఫ్యాన్స్‌ ఎమోషనల్.

Anil kumar poka

|

Updated on: Jan 28, 2024 | 2:45 PM

ఫ్యాన్స్! ఓ హీరో ఎదుగుదలలో ఇటుక పెళ్లల్లా ఉంటారు. నేరుగా పరిచయం లేక పోయినా.. తమ హీరోతో కాంక్రీట్ బాండింగ్ ఏర్పరుచుకుంటారు. ఆయన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దుఖాన్ని దూరంగా నుంచునే పంచుకుంటూ ఉంటారు. కెప్టెన్ విజయ్‌ కాంత్ ఫ్యాన్స్ కూడా... ఇదే చేస్తూ వచ్చారు. కానీ తాజాగా తన లేకున్నా.. ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన లెగసీని.. ఓ రెండు రోజుల నుంచి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఎందుకంటారా?

ఫ్యాన్స్! ఓ హీరో ఎదుగుదలలో ఇటుక పెళ్లల్లా ఉంటారు. నేరుగా పరిచయం లేక పోయినా.. తమ హీరోతో కాంక్రీట్ బాండింగ్ ఏర్పరుచుకుంటారు. ఆయన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దుఖాన్ని దూరంగా నుంచునే పంచుకుంటూ ఉంటారు. కెప్టెన్ విజయ్‌ కాంత్ ఫ్యాన్స్ కూడా… ఇదే చేస్తూ వచ్చారు. కానీ తాజాగా తన లేకున్నా.. ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన లెగసీని.. ఓ రెండు రోజుల నుంచి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఎందుకంటారా? ఆయనకు భారత దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషన్ వచ్చింది కనుక. ఆ అవార్డ్‌ అభిమానులకే సొంతం అంటూ.. కెప్టెన్ భార్య చెప్పారు కనుక. ఆయన రూపు.. ఆ మాట.. ఇప్పుడు మరుగున పడిపోకుండా… నెట్టింట తిరుగుతూనే ఉంది కనుక. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్‌ అవార్డుల వరించాయి. అయితే మరణాంతరం ఓ స్టార్‌ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనే కెప్టెన్‌ విజయ్‌కాంత్.

సినిమా, రాజకీయ రంగాల్లో కెప్టెన్‌ సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కెప్టెన్‌ అభిమానుల్లో చాలామంది సంతోషపడుతున్నారు. అదే సమయంలో విజయ్‌ కాంత్‌ మన మధ్యలేకపోవడం విచారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ కాంత్‌కు పద్మభూషణ్‌ అవార్డు రావడంపై స్పందించిన ఆయన సతీమణి ప్రేమలతా విజయకాంత్‌ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారామె. అంతేకాదు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును విజయ్‌కాంత్‌ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ, ఆయన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రేమలతా విజయకాంత్‌ వెల్లడించారు. స్టార్‌ హీరోగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కెప్టెన్‌ విజయ కాంత్‌ గతేడాది డిసెంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమైన ఆయన కరోనా బారిన పడడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 28, 2024 02:43 PM