Vidhi OTT: ఈ పెన్నుతో రాస్తే పరలోకానికే.. ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీల్లో సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లలో హిట్‌ కాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌లో మాత్రం ఇలాంటి సినిమాలకు మంచి వ్యూస్‌ వస్తుంటాయి. అదే మన తెలుగమ్మాయి ఆనంది ప్రత్యేక పాత్రలో నటించిన విధి.

Vidhi OTT: ఈ పెన్నుతో రాస్తే పరలోకానికే.. ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Vidhi Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2024 | 1:35 PM

ఓటీటీల్లో సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లలో హిట్‌ కాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌లో మాత్రం ఇలాంటి సినిమాలకు మంచి వ్యూస్‌ వస్తుంటాయి. అందుకే థియేటర్లలో నిరాశపర్చిన సినిమాలు కూడా అప్పుడప్పుడు ఓటీటీల్లో సత్తా చాటుతుంటాయి. అలా థియేటర్లలో రిలీజై పెద్దగా ఆకట్టుకోని ఒక మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే మన తెలుగమ్మాయి ఆనంది ప్రత్యేక పాత్రలో నటించిన విధి. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహిత్‌ నందా, ఆనంది హీరో, హీరోయిన్లుగా నటించారు. గతేడాది నవంబర్‌3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పెద్దగా ఆడలేకపోయింది. ప్రమోషన్లు పెద్దగా నిర్వహించడంతో అసలు థియేటర్లలో రిలీజైన విషయం కూడా చాలామందికి తెలియదు. అయితే సినిమా చూసిన కొద్ది మంది మాత్రం కొత్త కాన్సెప్ట్‌ బాగా ఉందన్నారు. ఇప్పుడీ విధి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విధి మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది . ఈ నేపథ్యంలో రిపబ్లిక్‌ డే కానుకగా శుక్రవారం (జనవరి 26) నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చింది.

ఆడియో డిస్క్రిప్టివ్‌ టెక్నాలజీతో

విధి సినిమాను ఆడియో డిస్క్రిప్టివ్‌ టెక్నాలజీతో తెరకెక్కించడం విశేషం. అంటి కంటి చూపు లేనివాళ్లు కూడా ఈ సినిమాను అనుభూతి చెందవచ్చు. సూర్య (రోహిత్‌ నందా) ఉద్యోగం కోసం ఊరి నుంచి పట్నం వస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే క్రమంలో ఓ రోజు ఓ వ్యక్తి దగ్గరున్న పెన్ను చూసి ముచ్చటపడతాడు. అయితే దాని ధర రూ.40 వేలు అని చెప్పడంతో షాక్‌ తింటాడు. ఆ తర్వాత అలాంటి పెన్‌ ఒకటి హీరోకు కూడా దొరుకుంది. ఆ పెన్‌తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతుంటారు. మరి ఈ పెన్‌ వల్ల సూర్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆనంది సూర్య జీవితంలోకి ఎలా వచ్చింది? అని తెలుసుకోవాలంటే విధి సినిమా చూడాల్సిందే. మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సినిమాలు చూడాలనుకునేవారికి విధి ఒక మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.