Sania Mirza: తెలివైన సానియా షోయబ్‌ను ఎలా పెళ్లి చేసుకుందో.. సనాకూ విడాకులు ఇస్తాడు: తస్లీమా నస్రీన్‌

మూడో వివాహం చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా షోయబ్ మాలిక్ లాంటి 'బ్యాడ్ బాయ్'ని ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారామె

Sania Mirza: తెలివైన సానియా షోయబ్‌ను ఎలా పెళ్లి చేసుకుందో.. సనాకూ విడాకులు ఇస్తాడు: తస్లీమా నస్రీన్‌
Sania Mirza, Shoaib Malik
Follow us
Basha Shek

|

Updated on: Jan 25, 2024 | 1:12 PM

మూడో వివాహం చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా షోయబ్ మాలిక్ లాంటి ‘బ్యాడ్ బాయ్’ని ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారామె. సానియా లాగే సనా జావేద్‌కు కూడా భవిష్యత్తులో షోయబ్‌ మాలిక్‌ విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకుంటాడని జోస్యం చెప్పారు తస్లీమా. షోయబ్ మాలిక్-సానియా మీర్జాలది సంతోషకరమైన జంట అని నేను అనుకున్నాను. నాదే పొరపాటు. తెలివైన అమ్మాయి అయిన సానియా మీర్జా ఇంత చెడ్డ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. షోయబ్ మాలిక్ ఏదో ఒకరోజు సనా జావేద్‌కి కూడా విడాకులు ఇస్తాడు. మళ్లీ వేరే అమ్మాయి X ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత X కి విడాకులు ఇచ్చి Y ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత Y కి విడాకులు ఇచ్చి Z ని పెళ్లి చేసుకుంటాడు. ఇస్లాం మీద నమ్మకం ఉంటే విడాకులు తీసుకోనవసరం లేదు’ అంటూ షోయబ్‌ గురించి చెప్పుకొచ్చారు తస్లీమా.

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పటివరకు షోయబ్ మాలిక్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మాలిక్ 2002లో అయేషా సిద్ధిఖీని పెళ్లాడగా, 2010లో సానియా మీర్జాతో పెళ్లయింది. ఇప్పుడు సానియాకు విడాకులు ఇచ్చి పాకిస్థానీ నటి సనా జావేద్‌ని పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా దంపతులకు ఇజాన్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. షోయబ్ మాలిక్ తమ మూడవ పెళ్లిని ప్రకటించిన వెంటనే, సానియా మీర్జా విడాకులు తీసుకోలేదని పుకార్లు వచ్చాయి. షోయబ్, సానియా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారని అతని తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పష్టం చేశారు. 41 ఏళ్ల షోయబ్ మాలిక్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. ప్రపంచంలోని ప్రధాన లీగ్‌లలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న మాలిక్.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టులో చోటు దక్కించుకోవడంపై నమ్మకంతో ఉన్నాడు.

షోయబ్ మాలిక్ పెళ్లి ఫొటోస్..

సానియా లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం