Ramayan: రణ్‌బీర్‌, సాయిపల్లవి ‘రామాయణ్‌’లో విజయ్‌ సేతుపతి.. ఏకంగా ఆ పాత్రలో మక్కల్‌ సెల్వన్

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. 'దంగల్‌' దర్శకుడు నితీష్‌ తివారీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రామాయణ్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది.

Ramayan: రణ్‌బీర్‌, సాయిపల్లవి 'రామాయణ్‌'లో విజయ్‌ సేతుపతి.. ఏకంగా ఆ పాత్రలో మక్కల్‌ సెల్వన్
Ramayan Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2024 | 2:00 PM

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘దంగల్‌’ దర్శకుడు నితీష్‌ తివారీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రామాయణ్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. దర్శకుడు చాలా మంది ఆర్టిస్టులతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తదితరులతో చిత్ర బృందం సమావేశం అయినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నటుడు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం . రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకటైన విభీషణుడి పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్ర ఇచ్చినా దానికి ప్రాణం పోసే ప్రతిభ ఆయన సొంతం. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా షారుఖ్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్ర హిందీ జనాలకు బాగా చేరువైంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీ ‘రామాయణం’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అందుకే విజయ్ సేతుపతి కాల్షీట్ అడిగినట్లు సమాచారం.

ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న ‘హనుమాన్’ టీమ్ కూడా విజయ్ సేతుపతికి విభీషణ్ పాత్రకు ఆఫర్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర సముద్రఖనికి వెళ్లిపోయింది. ఇప్పుడు అదే పాత్ర కోసం దర్శకుడు నితీష్ తివారీ నుంచి విజయ్‌ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి నితీష్ తివారీ రాసిన స్క్రిప్ట్ చూసి విజయ్ సేతుపతి హ్యాపీగా ఉన్నాడని అంటున్నారు . మరి విభీషణుడి రోల్‌ కోసం మక్కల్‌ సెల్వన్‌ ఒప్పుకుంటారా? లేదా ? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.మార్చి నెలలో ‘రామాయణం’ సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉంది. అప్పటికి నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. రామాయణం కథలో చాలా పాత్రలున్నాయి. కాబట్టి ఇది మల్టీ స్టారర్ సినిమా అవుతుంది. ఏ పాత్రకు ఎవర్ని ఎంపిక చేశారనే విషయమై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మేరీ క్రిస్మస్ సినిమాలో విజయ్ సేతుపతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..