జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు ఇప్పుడు ఈ పాట అతికినట్లు సరిపోతుంది. డోన్ట్ స్టాప్ అంటూ లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు తారక్. వరస విజయాలతో ఈయన మార్కెట్ భారీగానే పెరిగింది. కాకపోతే మునపట్లా జోరు మాత్రం చూపించడం లేదు. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమాలు అరవింద సమేత, ట్రిపుల్ ఆర్ మాత్రమే. ఇప్పుడు దేవరతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.