Hanuman: అయోధ్య రాముడికే కాదు.. భద్రాద్రి రామాలయానికి కూడా విరాళం.. హనుమాన్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ

హనుమాన్‌ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు ప్రశాంత్‌ వర్మ. తేజా సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన హనుమాన్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. మూడో వారంలోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్‌ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్లు రాబట్టిన హనుమాన్‌

Hanuman: అయోధ్య రాముడికే కాదు.. భద్రాద్రి రామాలయానికి కూడా విరాళం.. హనుమాన్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ
Hanuman Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2024 | 1:26 PM

హనుమాన్‌ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు ప్రశాంత్‌ వర్మ. తేజా సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన హనుమాన్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. మూడో వారంలోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్‌ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్లు రాబట్టిన హనుమాన్‌ 300 కోట్ల వైపు శర వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హనుమాన్‌ చిత్ర బృందం గ్రాటిట్యూడ్‌ మీట్‌ను గ్రాండ్‌ నిర్వహించింది. ఇందులో హీరో తేజ సజ్జా, అమృతా అయ్యర్‌, వరలక్ష్మితో సహా చిత్ర బృందమంతా పాల్గొంది. అలాగే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్‌ వర్మ సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షక దేవుళ్లకు, ఇందుకు కారణమైన చిత్ర బృందానికి పేరుపేరునా థ్యాంక్స్‌ చెప్పాడు.

‘ మా సినిమా విజయంలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ది కీలక పాత్ర. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. హనుమాన్‌కి సంబధించి మున్ముందు చాలా వేడుకలు ఉండనున్నాయి. యాభై రోజుల వేడుకలో సినిమాకి పని చేసిన వారందరికీ ప్రత్యేక బహుమతులు, కానుకలు అందజేయబోతున్నాం. ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ఒక పవిత్ర దేవాలయంగా భావిస్తున్నారు. ఈ సినిమా చూడడం ద్వారా ప్రేక్షకులకు తెలియకుండానే అయోధ్య రామ మందిరానికి ఐదు రూపాయిలు విరాళం అందజస్తున్నారు. ఇది నిర్మాత నిరంజన్ కృషితోనే సాధ్యపడింది. కేవలం అయోధ్య రాముడికే కాదు భద్రాద్రి రామయ్య తదితర ఆలయాలకు కూడా విరాళాలు అందజేస్తాం. మా సినిమాని వెన్నుముకలా నడిపించిన హనుమంతుల వారికీ రాముల వారికి ప్రేక్షకులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం’ అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రూ. 250 కోట్ల క్లబ్ లో హనుమాన్..

సక్సెస్ మీట్ లో అమృతా అయ్యర్, వరలక్ష్మి..

తేజా సజ్జా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?
వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?
రోడ్డంతా చేపల మయం.. పట్టుకునోళ్లకు పట్టుకున్నన్ని..!
రోడ్డంతా చేపల మయం.. పట్టుకునోళ్లకు పట్టుకున్నన్ని..!