- Telugu News Photo Gallery Cinema photos Heroines Anjali Regina Cassandra Busy with Continue Web Series in Tollywood Telugu Actress Photos
Anjali – Regina Cassandra: వరుస వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్న తెలుగు హీరోయిన్స్.. అంజలి – రెజీనా.
ఆశల్లేవని డాక్టర్లు చెప్పాక.. పేషెంట్ బతికి బయటపడితే ఎలా ఉంటుంది..? ఇప్పుడు కొందరు హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. దుకాణం బంద్.. ఇంక వీళ్ళ కెరీర్ ఖతమ్.. మూట ముల్లె సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో వెబ్ సిరీస్‌లు వాళ్ల కెరీర్‌కు అండగా నిలుస్తున్నాయి. సినిమా చిన్నచూపు చూసినా.. డిజిటల్‌కు పెద్ద దిక్కులా మారిన ఆ ముద్దుగుమ్మలెవరు.? ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఆ హీరోయిన్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్లే.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Jan 29, 2024 | 8:23 PM

ఆశల్లేవని డాక్టర్లు చెప్పాక.. పేషెంట్ బతికి బయటపడితే ఎలా ఉంటుంది..? ఇప్పుడు కొందరు హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. దుకాణం బంద్.. ఇంక వీళ్ళ కెరీర్ ఖతమ్.. మూట ముల్లె సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో వెబ్ సిరీస్‌లు వాళ్ల కెరీర్‌కు అండగా నిలుస్తున్నాయి.

సినిమా చిన్నచూపు చూసినా.. డిజిటల్‌కు పెద్ద దిక్కులా మారిన ఆ ముద్దుగుమ్మలెవరు.? ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఆ హీరోయిన్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్లే.

కానీ ఇప్పుడలా కాదు.. సినిమాలు లేకపోయినా వాటిని మించిన వెబ్ సిరీస్‌లు వాళ్ల కెరీర్స్‌ను ఆదుకుంటున్నాయి. వెండితెరపై కాకపోయినా.. బుల్లితెరపై తమ ప్రతాపం చూపిస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ కారణంగానే అంజలి కెరీర్ వెలిగిపోతుందిప్పుడు. ఝాన్సీ, ఫాల్ అంటూ క్వీన్ ఆఫ్ డిజిటల్ అయిపోయారు ఈ రాజోలు సుందరి. ఝాన్సీ తర్వాత అంజలికి వెబ్ సిరీస్‌లలో డిమాండ్ పెరిగిపోయింది.

అలాగే ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించని రెజీనా సైతం డిజిటల్‌పై ఫోకస్ చేసారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. హిందీ నుంచి కూడా రెజీనాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

రాకేట్ బాయ్స్, ఫింగర్ ట్రిప్, షూర్‌వీర్, ఫర్జీ, జాన్‌బాజ్ హిందుస్తాన్ కే లాంటి వెబ్ సిరీస్‌లలో నటించారు రెజీనా. నిత్యా మీనన్ కెరీర్‌కు కూడా వెబ్ సిరీస్‌లే హెల్ప్ అవుతున్నాయి.

బ్రీత్ 1 అండ్ 2 సిరీస్‌లతో పాటు మోడ్రన్ లవ్ హైదరాబాద్, కుమారి శ్రీమతిల్లో కనిపించారు. రెండేళ్ల కింద రుద్రతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. లాస్ట్ ఇయర్ రాజ్ డికే యాక్షన్ డ్రామా ఫర్జీతో మెప్పించారు. వీళ్ళే కాదు.. సమంత, శృతి హాసన్ లాంటి స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.





























