- Telugu News Photo Gallery Cinema photos Teja Sajja and Prasanth varma Movie Hanuman Talk and collections in Hollywood Telugu Entertainment Photos
Teja Sajja – Hanuman: హాలీవుడ్ సినిమాలో హనుమంతుడి ప్రస్తావన.! ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హనుమాన్.
స్టార్ హీరో లేడు.. తీసింది పెద్ద దర్శకుడు కాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరూ లేరు.. అయితేనేం తెలుగు ఇండస్ట్రీలో మరే అగ్ర హీరోకు.. పెద్ద సినిమాకు సాధ్యం కాని రికార్డులన్నింటినీ తుడచేసింది హనుమాన్. ఈ సినిమా సంచలనాలు లెక్కేయడానికే ఓ బుక్కు రాయాలేమో..? గత 16 రోజులుగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తూనే ఉంది హనుమాన్. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాకు ముందు ఈ ఇద్దరూ ఓ చిన్న హీరో, చిన్న దర్శకుడు. కానీ ఇప్పుడలా కాదు..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Jan 29, 2024 | 7:13 PM

స్టార్ హీరో లేడు.. తీసింది పెద్ద దర్శకుడు కాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరూ లేరు.. అయితేనేం తెలుగు ఇండస్ట్రీలో మరే అగ్ర హీరోకు.. పెద్ద సినిమాకు సాధ్యం కాని రికార్డులన్నింటినీ తుడచేసింది హనుమాన్.

ఈ సినిమా సంచలనాలు లెక్కేయడానికే ఓ బుక్కు రాయాలేమో..? గత 16 రోజులుగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తూనే ఉంది హనుమాన్. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాకు ముందు ఈ ఇద్దరూ ఓ చిన్న హీరో, చిన్న దర్శకుడు.

కానీ ఇప్పుడలా కాదు.. కేవలం 15 రోజుల్లోనే 250 కోట్ల గ్రాస్ దాటేసి.. టాలీవుడ్‌లో కొత్త చరిత్రకు తెరతీసింది హనుమాన్. 16 రోజుల్లోనే 135 కోట్ల షేర్ సాధించింది హనుమాన్. ఇప్పటికే 100 కోట్ల లాభాలు దాటిపోయాయి.

బాహుబలి, ట్రిపుల్ ఆర్ తర్వాత 100 కోట్ల లాభాలు ఓ సినిమాకు రావడం ఇదే తొలిసారి. కేవలం నైజాంలోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది హనుమాన్.. అలాగే ఓవర్సీస్‌లోనూ ఈ రికార్డ్ అందుకుంది.

దాంతో పాటు 4 వేర్వేరు రీజినల్ మార్కెట్స్‌లో 50 కోట్లు వసూలు చేసింది హనుమాన్. నాన్ రాజమౌళి కేటగిరీలో ఈ రికార్డ్ సాధించిన సినిమా హనుమాన్ మాత్రమే.

అలాగే విడుదలైన 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.33 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది హనుమాన్. ఇక ప్రీమియర్స్‌లోనూ హనుమాన్‌దే రికార్డ్. కేవలం నార్త్ అమెరికాలోనే 5 మిలియన్ మార్క్ అందుకుంది హనుమాన్.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఈ రికార్డ్ కేవలం ప్రశాంత్ వర్మకు మాత్రమే దక్కింది. 2024లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా హనుమానే.

అలాగే సంక్రాంతి సీజన్‌లో అల వైకుంఠపురములో తర్వాత ఎక్కువ వసూలు చేసింది ఈ చిత్రమే. మొత్తానికి హనుమాన్ జోరు చూస్తుంటే.. ఈ రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు.





























