- Telugu News Photo Gallery Cinema photos Heroine Shruti Haasan Gets Silent Movie Offers in Tollywood Details here Telugu Actress Photos
Shruti Haasan: శృతికి సైలెంట్ ఆఫర్స్.! చిన్న పాత్రలే కానీ.. హిట్స్ మీద హిట్స్.
సైలెంట్ కిల్లర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు శృతి హాసన్. ఫామ్‌లో లేనట్లే కనిపిస్తున్నారు కానీ ఏడాదికి ఈజీగా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈమె సొంతం అయిపోయింది. చాప కింద నీరులా వరస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూనే ఉన్నారు శృతి. అసలు శృతి నటిస్తున్న సినిమాలెన్ని..? సైలెంట్‌గా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు శృతి హాసన్. 2023లో తెలుగులోనే 4 సినిమాలు చేసారు ఈమె.
Updated on: Jan 29, 2024 | 6:06 PM

సైలెంట్ కిల్లర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు శృతి హాసన్. ఫామ్‌లో లేనట్లే కనిపిస్తున్నారు కానీ ఏడాదికి ఈజీగా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఈమె సొంతం అయిపోయింది.

చాప కింద నీరులా వరస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూనే ఉన్నారు శృతి. అసలు శృతి నటిస్తున్న సినిమాలెన్ని..? సైలెంట్‌గా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు శృతి హాసన్. 2023లో తెలుగులోనే 4 సినిమాలు చేసారు ఈమె.

పైగా అన్నీ విజయాలే కావడం గమనార్హం. జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో భాగమైన శృతి హాసన్.. డిసెంబర్‌లో హాయ్ నాన్న, సలార్ సినిమాలతో వచ్చారు.

దానికి ముందు కూడా క్రాక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలతో రచ్చ చేసారు ఈ బ్యూటీ. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు శృతి హాసన్. అంతేకాదు.. హాలీవుడ్ నుంచి కూడా ఈమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి.

గతేడాది ‘ది ఐ’ అనే సినిమాలో నటించారు శృతి. తాజాగా చెన్నై స్టోరీలో ఈ భామకు ఛాన్స్ వచ్చింది. సమంతను ముందు ఇందులో హీరోయిన్‌గా తీసుకున్నా.. ఆమె డేట్స్ సర్దుబాటు కాక శృతి వైపు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు.

ఫిలిప్ జాన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో చెన్నై స్టోరీ సినిమా ప్రకటించారు మేకర్స్. కానీ మయోసైటిస్ కారణంగా స్యామ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు.

గతంలో ఎవడు సినిమా సమయంలోనూ స్యామ్ హెల్త్ ఇష్యూస్ శృతి హాసన్‌కు వరంగా మారాయి. అప్పుడూ ఆ ఆఫర్ శృతికే వచ్చింది. మళ్లీ ఇప్పుడు చెన్నై స్టోరీ ఛాన్స్ శృతి ఇలాగే దక్కించుకున్నారు.




