Prasanth Varma: చిరంజీవి, మహేష్ పాత్రలను ఫిక్స్ చేసిన ప్రశాంత్ వర్మ.. గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం
తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు. ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని ఓ సూపర్ హీరో కథను సిద్ధం చేసుకొని సల్దిట్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి మరీ హనుమాన్ కు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి.
హిస్టారికల్ సినిమాలు తీయడానికి ప్రతి దర్శకుడు ఆసక్తి చూపుతారు. కొందరు ఇప్పటికే ఇతిహాసాల నేపథ్యంలో సినిమాలు తీసి సక్సెస్ అయ్యితే మరికొందరు ఫ్లాపులను మూటగట్టుకున్నారు. తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు. ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని ఓ సూపర్ హీరో కథను సిద్ధం చేసుకొని సల్దిట్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి మరీ హనుమాన్ కు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా వసూల్ చేసింది. అయితే ప్రశాంత్ వర్మ ఇక్కడితో ఆగాను అని అంటున్నాడు. ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని మరికొన్ని సూపర్ హీరోల సినిమాలను తెరకెక్కిస్తా అని చెప్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్కెల్ చాలా పెద్దది కావడంతో స్టార్ హీరోలు నటించే ఛాన్స్ ఉంది. దీని పై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..
హనుమంతుడి పాత్ర చేయడానికి బాలీవుడ్ నటులు సిద్ధంగా ఉన్నారు. కానీ చూడగానే మనకు నమస్కారం పెట్టాలి అనిపించాలి. అంతలా ఆపాత్రలో ఇమిడిపోవాలి.. కాబట్టి ఆ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు.. అన్ని కుదిరితే ఆయనతో హనుమంతుడి పాత్ర చేయాలనీ ఉంది. అలాగే శ్రీరాముడిగా నా మైండ్ లో ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు. రాముడి పాత్రలో ఆయనను ఎడిట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో చూశాను. నా ఆఫీస్ లో కూడా మహేష్ బాబు ఫోటోలను రాముడిగా రీ క్రియేట్ చేశాం అని తెలిపాడు ప్రశాంత్. దాంతో ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ యంగ్ డైరెక్టర్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.