AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: ‘నేనైతే ఆ సినిమా చేసేదాన్ని కాదు’.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్ సినిమా పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాలో హింస ఎక్కువ చూపించారని, మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు చూపించడం పై  చాలా మంది విమర్శలు గుప్పించారు.

Taapsee Pannu: 'నేనైతే ఆ సినిమా చేసేదాన్ని కాదు'.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ
Taapsee Pannu
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2024 | 8:06 AM

Share

గత ఏడాది వచ్చిన సినిమాల్లో సంచలన హిట్ కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగ తన స్టైల్ లో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్ సినిమా పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాలో హింస ఎక్కువ చూపించారని, మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు చూపించడం పై  చాలా మంది విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ యానిమల్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ లోనూ సత్తా చాటింది యానిమల్. యానిమల్ సినిమా పై ఇప్పటికే చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. చాలా మంది సినీ తారలు కూడా యానిమల్ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

తాజాగా యానిమల్ సినిమా పై హాట్ బ్యూటీ తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్ చేసింది. తాప్సీపన్ను టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నది బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

అంతే కాదు ఫైర్ బ్రాండ్ గా మారింది. ఇప్పటికే తాప్సీపన్ను చాలా వివాదస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా యానిమల్ సినిమా పై కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యానిమల్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది తాప్సీ. సినిమా యాక్టర్స్ కు ఓ పవర్ ఉంటుంది. అలాగే సమాజం పై బాధ్యత కూడా ఉండాలి.మిగిలిన వారందరూ దీని పాటించాలని నేను చెప్పడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం మనకు నచ్చింది చెయ్యొచ్చు.. అయితే నేను మాత్రం యానిమల్ లాంటి సినిమాలో నటించే దాన్ని కాదు అని చెప్పుకొచ్చింది తాప్సీపన్ను.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..