AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: యష్ణకు ప్రాణం పోసింది వీరే.. ఆసక్తికర పోస్ట్ చేసిన మృణాల్.. నల్లచీరలో మరింత అద్భుతం..

న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఇందులో మృణాల్ యష్ణ పాత్రలో కనిపించింది. ఇందులో మృణాల్ లుక్స్ మరింత అందంగా కనిపించింది. ఉంగరాల జుట్టు.. ముక్కు పుడకతో సరికొత్తగా కనిపించింది. అయితే తాజాగా హాయ్ నాన్న సినిమా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో తాను పోషించిన యష్ణ పాత్ర అంటే తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా యష్ణ పాత్రకు ఊపిరి పోసిన వారి గురించి ఆసక్తికర నోట్ రాసుకొచ్చింది.

Mrunal Thakur: యష్ణకు ప్రాణం పోసింది వీరే.. ఆసక్తికర పోస్ట్ చేసిన మృణాల్.. నల్లచీరలో మరింత అద్భుతం..
Mrunal Thakur
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2024 | 9:44 PM

Share

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో తన అద్భుతమైన నటనతో మరింతే దగ్గరయ్యింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఇటీవలే హాయ్ నాన్న మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఇందులో మృణాల్ యష్ణ పాత్రలో కనిపించింది. ఇందులో మృణాల్ లుక్స్ మరింత అందంగా కనిపించింది. ఉంగరాల జుట్టు.. ముక్కు పుడకతో సరికొత్తగా కనిపించింది. అయితే తాజాగా హాయ్ నాన్న సినిమా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో తాను పోషించిన యష్ణ పాత్ర అంటే తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా యష్ణ పాత్రకు ఊపిరి పోసిన వారి గురించి ఆసక్తికర నోట్ రాసుకొచ్చింది.

” తడిచిన జుట్టు.. చిన్న బొట్టు.. నల్ల చీర యష్ణకు ఎంతో ప్రత్యేకతను ఇచ్చాయి. నల్లచీరలో యష్ణ మరింత అందంగా కనిపించింది.. తనను అలా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ తనను అలా రెడీ చేయడానికి సహాయపడిన వ్యక్తుల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. యష్ణ మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్, చీర డిజైనర్స్.. చీరలను సెలక్ట్ చేసినవారందరికి ధన్యవాదాలు. చాలా చిన్న విషయాలు ఇవి.. కానీ వాటివల్లే తను పూర్తిగా పరిపూర్ణంగా కనిపించింది. ఇంత మనోహరమైన రూపం వెనక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మృణాల్.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. రౌడ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. ఇదే కాకుండా శివకార్తికేయన్ కొత్త ప్రాజెక్టులోనూ మృణాల్ నటిస్తుంది. ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రానికి AR మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ