AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saindhav OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానున్న సైంధవ్.. ఎక్కడ చూడొచ్చంటే..

హిట్ 2 సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్ తోనే ఈమూవీపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ బలంగా ఉన్నా.. సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడడంతో అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్.. యాక్షన్ డ్రామాగా క్లిక్ అయ్యింది. ఇక విడుదలై నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది సైంధవ్. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్నట్లుగానే మరికొన్ని గంటల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

Saindhav OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానున్న సైంధవ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Saindhav OTT
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2024 | 8:54 PM

Share

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి సైంధవ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. చాలా కాలం తర్వాత ఊర మాస్ లుక్‏లో కనిపించి అలరించారు వెంకీ. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అప్పటికే హనుమాన్, గుంటూరు కారం సినిమాలు విడుదలై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్నా… ఫ్యామిలీ అడియన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది సైంధవ్. హిట్ 2 సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్, టీజర్ తోనే ఈమూవీపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ బలంగా ఉన్నా.. సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడడంతో అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్.. యాక్షన్ డ్రామాగా క్లిక్ అయ్యింది. ఇక విడుదలై నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది సైంధవ్. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్నట్లుగానే మరికొన్ని గంటల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో నేరుగా చూడొచ్చు. కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ తండ్రి చేసే పోరాటమే ‘సైంధవ్’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, బేబీ సారా కీలకపాత్రలలో నటించారు.

కథ విషయానికి వస్తే.. తన కూతురికి అరుదైన జబ్బు ఉందని వెంకటేష్ కు తెలుస్తుంది. ఆ సమస్య నుంచి తన కూతురిని రక్షించుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ కావాలి. దీంతో తన కూతురిని ఎలా కాపాడుకోవాలని అని బాధపడుతుండగా.. అదే జబ్బుతో ఇంకా చాలా మంది చిన్నారులు బాధపడుతున్నారని తెలుసుకుంటాడు. అదే సమయంలో కొందరు టెర్రరిస్టులు వెంకీని చూసి భయపడుతుంటారు. ఇంతకీ వారికి వెంకీ గతంతో సంబంధం ఏంటీ ?.. తన చిన్నారిని ఎలా కాపాడుకుంటాడు ? అనేది సైంధవ్ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్