AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: అభిషేక్‌తో విడాకుల రూమర్లు.. భర్త పుట్టిన రోజున ఐశ్వర్య ఏం పోస్ట్‌ పెట్టిందో తెలుసా?

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. తన భర్త అభిషేక్ బచ్చన్‌తో ఐష్‌ గొడవపడిందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లను అటు ఐష్‌ కానీ, అభిషేక్‌ కానీ ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు.

Aishwarya Rai: అభిషేక్‌తో విడాకుల రూమర్లు.. భర్త పుట్టిన రోజున ఐశ్వర్య ఏం పోస్ట్‌ పెట్టిందో తెలుసా?
Aishwarya Rai Bachchan Family
Basha Shek
|

Updated on: Feb 05, 2024 | 8:37 PM

Share

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. తన భర్త అభిషేక్ బచ్చన్‌తో ఐష్‌ గొడవపడిందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లను అటు ఐష్‌ కానీ, అభిషేక్‌ కానీ ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. కనీసం స్పందించలేదు కూడా. దీంతో ఐష్‌- అభిషేక్‌ నిజంగా విడిపోయారా? విడాకులు తీసుకుంటున్నారా? అన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానంగా ఐశ్వర్యరాయ్ ఓ అందమైన ఫోటోను షేర్ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అబిమానులు, నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ ఉదయం నుంచి సన్నిహితులంతా అభిషేక్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ, ఐశ్వర్యరాయ్ నుంచి ఎలాంటి విషెస్‌ రాలేదు. దీంతో మరోసారి ఈ అందమైన జంట విడాకుల రూమర్లు బాగా వైరలయ్యాయి. అయితే ఆలస్యంగానైనా ఐశ్వర్య రాయ్ ఒక అందమైన ఫోటోను పంచుకోవడం ద్వారా తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ ఫొటోలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తో సహా వారి కుమార్తె ఆరాధ్య కూడా ఉన్నారు. ముగ్గురూ హ్యాపీగా దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ ఫోటో ద్వారా విడాకుల గురించి గాసిప్స్ ప్రచారం చేసే వారికి ఐశ్వర్యరాయ్ బచ్చన్ సరైన సమాధానం చెప్పింది’ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదిగో మీకివే నా పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా’ అని అభిషేక్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పింది ఐశ్వర్య.

ఇవి కూడా చదవండి

ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లో బచ్చన్ ఫ్యామిలీ.. వీడియో

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లుగా మంచి గుర్తింపు పొందారు. పెళ్లి తర్వాత ఐశ్వర్యరాయ్ సినిమాల ఎంపికపై తొందరపడడం లేదు. చాలా అరుదుగా ఒక్కో సినిమాకు అంగీకరిస్తూ నటిస్తోంది. అదే సమయంలో అభిషేక్ బచ్చన్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా అలరిస్తున్నాడు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ