Ayalaan OTT: అఫీషియల్‌.. తెలుగులో రిలీజ్‌ కాకముందే ఓటీటీలో అయలాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

శివకార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం అయలాన్‌. ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌కు సైన్స్‌ ఫిక్షన్‌ నో జోడించి ఆర్‌. రవికుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్‌ నిపుణులను ఆశ్చర్యపరిచింది. అయితే అదే సమయంలో తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో తెలుగు వెర్షన్‌ వాయిదా వేశారు.

Ayalaan OTT: అఫీషియల్‌.. తెలుగులో రిలీజ్‌ కాకముందే ఓటీటీలో అయలాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Ayalaan Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 06, 2024 | 8:09 PM

శివకార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం అయలాన్‌. ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌కు సైన్స్‌ ఫిక్షన్‌ నో జోడించి ఆర్‌. రవికుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్‌ నిపుణులను ఆశ్చర్యపరిచింది. అయితే అదే సమయంలో తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో తెలుగు వెర్షన్‌ వాయిదా వేశారు. మొదట జనవరి 26న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తామన్నారు. అందుకోసం ముందుగానే అడ్వాన్స్ టికెట్లను కూడా అందుబాటులో పెట్టారు. అయితే కొన్ని సమస్యల కారణంగా షోలను రద్దు చేశారు.ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు కూడా తిరిగిచ్చేశారు. అయితే అయలాన్‌ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్‌లో రిలీజయ్యేట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్ట్స్‌ అయలాన్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఫిబ్రవరి 9 నుంచి శివ కార్తికేయన్‌ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా అయలాన్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ వివరాలను ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగులో కూడా అయలాన్‌ స్ట్రీమింగ్‌ కు అందుబాటులో ఉంటుందని సన్‌ నెక్ట్స్‌ ప్రకటించింది.

కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై కోటపాడి జె.రాజేష్ అయలాన్‌ సినిమాను భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలు పోషించారు. యోగి బాబు, భాను ప్రియ, బాల శరవణన్‌, రాహుల్‌ మహదేవ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్‌ విజేత ఏ ఆర్‌ రహమాన్‌ ఈ సినిమాకు స్వరాలందించడం విశేషం. మరి అయలాన్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నవారంతా ఫిబ్రవరి 9న ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజుల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..