AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Tulsi vs Krishna Tulsi: తులసి మొక్కల్లో ఎన్ని రకాలో తెలుసా..! రామ తులసి, కృష్ణ తులసికి తేడా.. ఏ మొక్కను పెంచుకోవాలంటే..

పూజకు, ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేసే తులసి మొక్క అంటే సర్వసాధారణంగా రామ తులసి, కృష్ణ తులసి అని అనుకుంటారు. అయితే ఇతర మొక్కల మాదిరిగానే.. తులసిలో దాదాపు 100 విభిన్న రకాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా రామ తులసి రాముడికి  ప్రీతికరమైనదిగా, కృష్ణ తులసి కృష్ణుడికి ప్రియమైనదిగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో రామ తులసి, కృష్ణ తులసికి సంబంధించిన మతపరమైన ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Rama Tulsi vs Krishna Tulsi: తులసి మొక్కల్లో ఎన్ని రకాలో తెలుసా..! రామ తులసి, కృష్ణ తులసికి తేడా.. ఏ మొక్కను పెంచుకోవాలంటే..
Rama Tulsi Or Krishna Tulsi
Surya Kala
|

Updated on: Feb 08, 2024 | 6:04 PM

Share

హిందూ మతంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. తులసి మొక్క విష్ణ ప్రియ అని లక్ష్మీదేవి నివాసం అని హిందువుల నమ్మకం. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. పూజకు, ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేసే తులసి మొక్క అంటే సర్వసాధారణంగా రామ తులసి, కృష్ణ తులసి అని అనుకుంటారు. అయితే ఇతర మొక్కల మాదిరిగానే.. తులసిలో దాదాపు 100 విభిన్న రకాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా రామ తులసి రాముడికి  ప్రీతికరమైనదిగా, కృష్ణ తులసి కృష్ణుడికి ప్రియమైనదిగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో రామ తులసి, కృష్ణ తులసికి సంబంధించిన మతపరమైన ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

రామ, కృష్ణ తులసి మొక్కల మధ్య తేడా ఏమిటంటే

రామ తులసి, కృష్ణ తులసి  మొక్కల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. రామ తులసి ఆకులు ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఘాటైన  వాసన ఉండే ఈ ఆకుల రుచి మధురంగా ఉంటుంది. ఔషధగుణాలు అధికంగా ఉంటాయి. అదే విధంగా కృష్ణ తులసి ఆకులు ఊదా రంగులో లేదా ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి. వీటి రుచి కూడా కొద్దీ చేదుగా ఉంటుంది. కొంచెం తీపి వాసన వస్తుంది. ఈ ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి.

ఏ తులసి మొక్కకు ఏ విధమైన ప్రాముఖ్యత:

ప్రతి ఇంట్లో ఎక్కువగా కనిపించేది రామ తులసి. ఈ మొక్క శ్రీ రాముడికి ప్రీతికరమైనది. దీనిని తులసి పూజలో ఎక్కువగా వినియోగిస్తారు.అంతేకాదు ఇంటికి ఆనందాన్ని, సంపద శ్రేయస్సుని తెస్తుందని విశ్వాసం. అదే విధంగా కృష్ణ తులసి మొక్క శ్రీ కృష్ణుడికి ప్రీతికరమైనది. దీనిని ఎక్కువగా ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఇంట్లో కృష్ణ తులసి ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుందని విశ్వాసం. కనుక ఎక్కువ మంది రామ తులసి, కృష్ణ తులసిని కలిపి పెంచుకుంటారు. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. అదే సమయంలో ఏ తులసి మొక్క అయినా సరే… ఆదివారం, గురువారం, శుక్రవారం రోజులతో పాటు ఏకాదశి రోజున గ్రహణ సమయాల్లో తాకరాదనేది నియమం ఉంది.

ఇవి కూడా చదవండి

తులసి మొక్కను ఏ దిశలో నాటలంటే

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిక్కులో సూర్యుడి వెలుగు ఎక్కువగా వస్తుంది. అంతేకాదు తూర్పు దిశలో దేవతలు నివశిస్తారని విశ్వాసం.  కుబేరుడు ఉత్తర దిశలో ఉంటాడు. కనుక తులసి మొక్కను నాటే సమయంలో దిశ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు