AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupam Kher: రూ. 37 లతో ముంబైలో అడుగు పెట్టి.. 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 532వ సినిమాలో నటించిన నట దిగ్గజం అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో తాజాగా 532వ సినిమాలో నటించినట్లు చెప్పారు. 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానంటే.. ఈ రోజుకీ ఏ సినిమాలోనైనా కొత్తవాడిగా పని చేయాలని నమ్మడం వల్లనే అని చెప్పారు. ప్రజలు నన్ను 'అనుభవజ్ఞుడు' అని పిలిస్తే నేను భయపడతాను. ప్రజలు మనల్ని ఎలా చూస్తారో అన్నదానికి భిన్నంగా తాను భిన్నమైన రీతిలో చూడాలని భావిస్తానని పేర్కొన్నారు.    అయితే తాను ఏ సినిమాలో నటిస్తున్నా ఆ పాత్రలో తన అనుభవాన్ని పాత్ర పట్ల ప్రేమతో నటిస్తానని అన్నారు

Anupam Kher: రూ. 37 లతో ముంబైలో అడుగు పెట్టి.. 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 532వ సినిమాలో నటించిన నట దిగ్గజం అనుపమ్ ఖేర్
anupam kher 40 years movie career
Surya Kala
|

Updated on: Feb 08, 2024 | 4:51 PM

Share

బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితులే.. తన నటనతో డైలాగ్ డెలివరీతో క్యారెక్టర్ కు వన్నె తెచ్చే నటుల్లో అగ్రతాంబూలం అందుకున్న అనుపమ్ ఖేర్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన  సాయి మంజ్రేకర్, గురు రంధవా చిత్రం ‘కుచ్ ఖట్టా హో జాయే’ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సినిమా అనుపమ్ ఖేర్ కెరీర్‌లో 532వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన 40 ఏళ్ల ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లు అయినా తాను ఈ రోజుకీ కొత్తగా సినీ  పరిశ్రమలో అడుగు పెట్టినట్లు.. కొత్త నటుడిలా పనిచేయడం తనకు ఇష్టమని అనుపమ్ ఖేర్ చెప్పారు. ఎవరైనా అనుభవజ్ఞుడు అనే పదాన్ని వాడితే తనకు అస్సలు నచ్చదని అన్నారు.

అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో తాజాగా 532వ సినిమాలో నటించినట్లు చెప్పారు. 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానంటే.. ఈ రోజుకీ ఏ సినిమాలోనైనా కొత్తవాడిగా పని చేయాలని నమ్మడం వల్లనే అని చెప్పారు. ప్రజలు నన్ను ‘అనుభవజ్ఞుడు’ అని పిలిస్తే నేను భయపడతాను. ప్రజలు మనల్ని ఎలా చూస్తారో అన్నదానికి భిన్నంగా తాను భిన్నమైన రీతిలో చూడాలని భావిస్తానని పేర్కొన్నారు.    అయితే తాను ఏ సినిమాలో నటిస్తున్నా ఆ పాత్రలో తన అనుభవాన్ని పాత్ర పట్ల ప్రేమతో నటిస్తానని అన్నారు. అయితే ఇంతకు ముందు తాను గమ్యం లేకుండా వేగంగా పరిగెత్తానని..ఇప్పుడు సరైన దిశలో నెమ్మదిగా కదులుతున్నానని చెప్పారు.

37 రూపాయలతో ముంబైకి చేరుకున్న అనుపమ్ ఖేర్

తన సినీ కెరీర్‌లో ఒడిదుడుకుల గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. “జీవితంలో చేదును రుచి చూడకపోతే.. ఎవరైనా సరే నిజమైన ఆనందాన్ని అర్థం చేసుకోలేరు. ప్రయాణంలో ఎలాంటి కష్టం లేకపోతే దాన్ని ప్రయాణం అని చెప్పలేం. జీవితంలో కష్టాలు ఉండాలి, ఎత్తుపల్లాలు ఉండాలి, అప్పుడే జీవితాన్ని అర్ధం చేసుకుని గడపవచ్చు.  ఆనందించవచ్చు. తన ముందున్న మార్గం సరళంగా..  ఉంటే.. దానిపై నడవడాన్ని అంతగా ఆస్వాదించను నేను అని చెప్పారు.. తాను తనకు ఎదురయ్యే సమస్యలను స్వాగతిస్తానని.. వైఫల్యాలు , చెడు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటానని చెప్పారు అనుపమ్ ఖేర్. అయితే వాటిని ఎప్పుడూ గుర్తు చేసుకోను.. ఎందుకంటే.. జీవితంలో ఎదురుచూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారు. నేను చాలా అదృష్టవంతుడిని. 1981లో 37 రూపాయలతో ముంబై నగరంలో అడుగు పెట్టాను. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు నా 532వ సినిమా గురించి మాట్లాడుతున్నాను.. ఇంతకంటే ఏమి కావాలి.. ఇంకా ఏం అడగాలి, చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు అనుపమ్ కేర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..