AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yami Gautham: గుడ్ న్యూస్ షేర్ చేసిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ హీరోయిన్.. యామీ గౌతమ్ వీడియో వైరల్..

తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు. నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి... కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం ఆర్టికల్ 370 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఆదిత్య జంబాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియమణి కీలకపాత్రలో నటిస్తుండగా..

Yami Gautham: గుడ్ న్యూస్ షేర్ చేసిన 'ఫెయిర్ అండ్ లవ్లీ' హీరోయిన్.. యామీ గౌతమ్ వీడియో వైరల్..
Yami Gautam
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2024 | 9:39 AM

Share

‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చే బ్యూటీ యామీ గౌతమ్. ఈ యాడ్ ద్వారా అంతగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. పంజాబ్‌కు చెందిన బ్యూటీ.. 2009లో ఉల్లాస కషాషా సినిమాతో కన్నడ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి హిందీ, తెలుగు, పంజాబీ చిత్రాల్లో నటించారు. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు. నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి… కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం ఆర్టికల్ 370 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఆదిత్య జంబాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియమణి కీలకపాత్రలో నటిస్తుండగా.. యామీ గౌతమ్ భర్త ఆదిత్య థార్, ఆమె సోదరుడు లోకేష్ థార్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

యామీ గౌతమ్ 2021లో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆదిత్య ధర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటించిన చిత్రం ఆర్టికల్ 370. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న యామీ గౌతమ్ అభిమానులతో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఆర్టిక్ల 370 షూటింగ్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని.. దీంతో సెట్ లో అందరూ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారని తెలిపింది.

ప్రెగ్నెన్సీ సమయంలో మానసికంగా ఎంతో ఆందోళన కలుగుతుందని.. ప్రతి క్షణం ఎంతో సవాలుగా ఉంటుందని.. తన భర్త ఆదిత్య తన పక్కన లేకుండా ఏమి అయ్యేదో తనకు తెలియదని తెలిపింది. ఆర్టికల్ 370 సినిమాను పూర్తిచేయడానికి ఒక నటిగా పూర్తి బాధ్యత తనపై ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.