Tollywood: అభిమానుల గుండెల్లో చెరగని రూపం.. ఇప్పటికీ వీడని సూసైడ్ మిస్టరీ.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తున్నాడా ?..
అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రీల్ హీరోగానే కాదు.. నిజ జీవితంలోనూ సూపర్ హీరో అతడు. డీసీఇ ఎంట్రన్స్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి ఫ్యామిలీ అడియన్స్కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వెండితెరపై నటుడిగా అడుగుపెట్టి.. ఎన్నో హిట్స్ అందుకున్నారు. స్టార్ హీరోగా అప్పుడే క్రేజ్ అందుకున్న ఈ హీరో.. ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన మరణవార్తను అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఓ కుర్రాడు.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రీల్ హీరోగానే కాదు.. నిజ జీవితంలోనూ సూపర్ హీరో అతడు. డీసీఇ ఎంట్రన్స్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి ఫ్యామిలీ అడియన్స్కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వెండితెరపై నటుడిగా అడుగుపెట్టి.. ఎన్నో హిట్స్ అందుకున్నారు. స్టార్ హీరోగా అప్పుడే క్రేజ్ అందుకున్న ఈ హీరో.. ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన మరణవార్తను అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకు చురుకుగా కనిపించిన ఈ హీరో.. తన గదిలో విగతజీవిగా కనిపించాడు. అతడి మరణం సూసైడ్ అంటూ అధికారులు నివేదికలో వెల్లడించగా.. అతడి కుటుంబసభ్యులు, అభిమానులు మాత్రం తమ హీరోది సూసైడ్ కాదు.. హత్యే అంటున్నారు. ఇప్పటికీ అతడి మరణం వీడని మిస్టరీ..ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పడు తమ అభిమాన హీరో రేర్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ హీరో ఎవరంటే.. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 2013లో కై పో చే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత శుద్ధ దేశీ రొమాన్స్, పికె, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి చిత్రాల్లో నటించారు. ఇక 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ మూవీ అతడి కెరీర్ టర్నింగ్ పాయింట్. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ధోని పాత్రలో కనిపించాడు సుశాంత్. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే 2020లో జూన్ 14న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇప్పటికీ సుశాంత్ మరణం పై వీడని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అతడు ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారంటూ కుటుంబసభ్యులతోపాటు.. సెలబ్రెటీస్, అభిమానులు వాపోతున్నారు. కానీ ఇప్పటికీ సుశాంత్ మరణంపై స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ రేర్ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పైన మీరు చూస్తోన్న ఫోటో.. సోంచిరియా సినిమాలోనిది.. ఇందులో లక్షణ పాత్రలో కనిపించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




