AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha: రజినీకాంత్ హీరోయిన్‌కు ఊహించని చిక్కులు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటి సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు ఇప్పుడు అనుకోని చిక్కుల్లో పడింది. మోసం చేశారన్న ఆరోపణల కేసులో సోనాక్షి సిన్హా టీమ్ ఆరుగురు సభ్యులపై, ఆమె మేనేజర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.  అంతే కాదు అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Sonakshi Sinha: రజినీకాంత్ హీరోయిన్‌కు ఊహించని చిక్కులు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
Sonakshi Sinha
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2024 | 2:45 PM

Share

కొంతమంది సినీ తారలు కొంతమంది అనుకోని చిక్కుల్లో పడుతూ ఉంటారు. కొంతమంది కోర్టు మెట్లెక్కితే మరికొంతమంది ఏకంగా అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటి సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు ఇప్పుడు అనుకోని చిక్కుల్లో పడింది. మోసం చేశారన్న ఆరోపణల కేసులో సోనాక్షి సిన్హా టీమ్ ఆరుగురు సభ్యులపై, ఆమె మేనేజర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.  అంతే కాదు అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు నుంచి సోనాక్షి సిన్హాకు తాత్కాలిక ఉపశమనం లభించింది, అయితే విచారణ కొనసాగుతున్నందున, ఆమె కూడా న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

2018లో, నటి సోనాక్షి సిన్హా ఒక పబ్లిక్ ఈవెంట్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్ అందుకుంది. . కానీ ఆ ప్రోగ్రాంకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఈవెంట్ నిర్వాహకులకు భారీ నష్టం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే కాకుండా..  సోనాక్షి సిన్హా ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు కోర్టులో మోసం కేసు వేశారు. ట్రయల్ కోర్టు సోనాక్షి మేనేజర్లు అలాగే ఆమె టీమ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

సోనాక్షి సిన్హా టీమ్ మాళవిక పంజాబీ, ధుమిల్ థక్కర్, ఎడ్గార్ సకారియా, అభిషేక్ సిన్హా ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ నుండి డబ్బు అందుకున్నారు. సెప్టెంబర్ 30, 2018న జరిగిన ఈవెంట్‌కు సోనాక్షి హాజరు కావాల్సి ఉండగా, ఆమె ఆ కార్యక్రమానికి రాలేదు. దీంతో నిర్వాహకులు సోనాక్షి సిన్హా అండ్ టీమ్‌పై ఫిబ్రవరి 2019లో మురాదాబాద్ కోర్టులో కేసు వేశారు.

ఈ కేసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన నటి సోనాక్షి సిన్హా పిటిషన్ దాఖలు చేసి, ఈ కేసులో తనపై జరుగుతున్న ఆపరేషన్, విచారణపై స్టే విధించారు. కానీ ఆమె టీమ్ పై విచారణ జరుగుతోంది.  సోనాక్షి టీమ్ పై ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. సోనాక్షి సిన్హా ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా చోటే మియా’ , ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ చిత్రాలతో బిజీగా ఉంది. ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది ఈ అమ్మడు. అలాగే ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించింది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.