12th Fail: మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న 12th ఫెయిల్.. ఆ లిస్ట్‌లో ఏకైక ఇండియన్ చిత్రంగా
ఈ చిత్రం 27 అక్టోబర్ 2023న విడుదలైంది. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా మేధా శంకర్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదలై 100రోజులుపూర్తి చేసుకుంది.

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న సినిమా 12th ఫెయిల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఈ చిత్రం 27 అక్టోబర్ 2023న విడుదలైంది. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా మేధా శంకర్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదలై 100రోజులుపూర్తి చేసుకుంది. ఇప్పటీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమా 69వ ‘ఫిలిం ఫేర్’ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఏకంగా ఈ సినిమా 69వ ఫిలిం ఫేర్‌లో 5 అవార్డులు సొంతం చేసుకుంది.
తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది 12th ఫెయిల్. అలాగే ఈ సినిమా అంతర్జాతీయంగానూ దూసుకుపోతుంది. అంతర్జాతీయంగా ఉత్తమ చిత్రాల జాబితాలో నిలిచింది 12th ఫెయిల్. అంతర్జాతీయంగా బెస్ట్ మూవీస్ లిస్ట్ లో టాప్ 50లో నిలిచింది ఈ సినిమా. టాప్ -50లో చేరిన ఏకైక ఇండియన్ చిత్రంగా 12Th ఫెయిల్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ విషయాన్ని మూవీ దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమా ఓ బయోపిక్. ముంబయి మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిచారు. మనోజ్ రూమ్ మేట్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విధు వినోద్ చోప్రా. విక్రాంత్ మస్సే నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
విధు వినోద్ చోప్రా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




