AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: మాజీ భార్య సినిమాపై ధనుష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ‘లాల్ సలామ్’ గురించి ఏమన్నారంటే..

ఇక ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె తిరిగి మెగా ఫోన్ పట్టారు. లాల్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. ఇందులో రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ పాత్రలో రజనీ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్‏తో క్యూరియాసిటిని కలిగించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ బిజినెస్ ఎక్కువే జరిగింది. ఇక ఈరోజు ఈ చిత్రం అడియన్స్ ముందుకు వచ్చింది.

Dhanush: మాజీ భార్య సినిమాపై ధనుష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. 'లాల్ సలామ్' గురించి ఏమన్నారంటే..
Dhanush, Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2024 | 1:44 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలామ్. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో ధనుష్ నటించిన త్రీ సినిమాతో దర్శకురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైంది ఐశ్వర్య. ఆ తర్వాత ఆ తర్వాత వాయ్ రాజా వాయ్ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఇక ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె తిరిగి మెగా ఫోన్ పట్టారు. లాల్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. ఇందులో రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ పాత్రలో రజనీ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్‏తో క్యూరియాసిటిని కలిగించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ బిజినెస్ ఎక్కువే జరిగింది. ఇక ఈరోజు ఈ చిత్రం అడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే.. ఐశ్వర్య సినిమాపై ఆమె మాజీ భర్త ధనుష్ స్పందించారు. లాల్ సలామ్ చిత్రం ఈరోజు విడుదలైన సందర్భంగా… తన ట్విట్టర్ ఖాతాలో ‘ఈరోజు లాల్ సలామ్’ అంటూ ట్వీట్ చేస్తూ తన ఫ్యానిజాన్ని చాటుకున్నాడు. ముందు నుంచి ధనుష్ రజినీకాంత్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన జైలర్ సినిమాను కూడా ప్రత్యేకంగా వీక్షించారు ధనుష్. ఆయన ట్వీట్ వేసిన గంటలోపే ఫుల్ రీచ్ వచ్చేసింది. ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా వ్యూస్ రాగా.. మూడు వేల రీట్వీట్లు చేశారు.

ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వేల అభిప్రాయ భేదాలు వచ్చినా ఐశ్వర్య కోసం ధనుష్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌ను అభిమానులు అభినందిస్తున్నారు. లాల్ సలామ్ విడుదలకు ముందు చిత్రబృందాన్ని అభినందిస్తూ ఒక ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.