- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR may either go to War 2 or Prashanth Neel directed movie after Devara shooting Telugu Heroes Photos
Jr NTR – Prabhas: ప్రభాస్ కారణంగా ఇరకాటంలో పడిన ఎన్టీఆర్.! నెక్స్ట్ ఎటువైపు.?
ప్రభాస్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఇరకాటంలో పడ్డారా..? నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పినట్లు బటర్ ఫ్లై ఎఫెక్ట్.. తాజాగా తారక్‌పైనే అప్లై అయ్యిందా..? ఫ్యూచర్ గురించి ఊహించకుండా.. కెరీర్‌ను తానే డేంజర్ జోన్‌లోకి నెట్టేసుకున్నారా..? చేతిలో ఉన్న దర్శకుడిని స్నేహితుడికి ఇచ్చేయడంతో.. తారక్ కన్ప్యూజన్‌లోకి వెళ్లిపోయారా..? అసలు జూనియర్ ప్లానింగ్ ఏంటి..? నిజంగానే ఎన్టీఆర్ విషయంలో జరుగుతుంది ఇదే అనిపిస్తుంది.
Updated on: Feb 08, 2024 | 2:09 PM

ప్రభాస్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఇరకాటంలో పడ్డారా..? నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పినట్లు బటర్ ఫ్లై ఎఫెక్ట్.. తాజాగా తారక్‌పైనే అప్లై అయ్యిందా..? ఫ్యూచర్ గురించి ఊహించకుండా.. కెరీర్‌ను తానే డేంజర్ జోన్‌లోకి నెట్టేసుకున్నారా..? చేతిలో ఉన్న దర్శకుడిని స్నేహితుడికి ఇచ్చేయడంతో.. తారక్ కన్ప్యూజన్‌లోకి వెళ్లిపోయారా..?

అసలు జూనియర్ ప్లానింగ్ ఏంటి..? నిజంగానే ఎన్టీఆర్ విషయంలో జరుగుతుంది ఇదే అనిపిస్తుంది. పాపం ఆయనకు తెలియకుండానే కెరీర్‌ను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసుకున్నారు యంగ్ టైగర్. నిన్నమొన్నటి వరకు వరస సినిమాలతో బిజీగా ఉన్నట్లు కనిపించారు తారక్. కానీ అవన్నీ కేవలం పేపర్‌కే పరిమితం అయ్యాయి.

దేవర తర్వాత నెక్ట్స్ ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి వచ్చేసిందిప్పుడు. నిజానికి కొరటాల శివతో చేస్తున్న దేవర తర్వాత ప్రశాంత్ నీల్‌తో పాటు బుచ్చిబాబు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

వీళ్ళు మాత్రమే కాకుండా.. అట్లీ, వెట్రి మారన్ అంటూ లిస్టు పెద్దగానే వినిపించింది. కానీ ఇదంతా నిన్నటి వరకు..! సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మారిపోయింది. సలార్ 2 కోసం మరో ఏడాది అక్కడే లాక్ అయిపోయారు నీల్.

సలార్ 2 ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై పడింది. మరోవైపు ఈ ఏడాది అంతా దేవరతోనే బిజీగా ఉండనున్నారు తారక్. మధ్యలో వార్ 2కు డేట్స్ ఇచ్చినా.. అది తెలుగు సినిమా కాదు.

హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నారు తారక్. దేవర పార్ట్ 1 అయ్యాక.. వార్ 2 మొదలు కానుంది. దీని తర్వాత దేవర 2కు డేట్స్ ఇచ్చారు యంగ్ టైగర్.

బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల్సి ఉన్నా.. అది కాస్తా రామ్ చరణ్‌కు షిఫ్ట్ అయింది. ప్రశాంత్ నీల్ సినిమా ఉందనే.. బుచ్చిబాబును వదిలేసారు తారక్. కానీ ప్రభాస్ కోసం అదే ప్రశాంత్ ప్లాన్ మార్చారిప్పుడు.

దాంతో దేవర తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిపోయినట్లే. త్రివిక్రమ్ సినిమా ఉందంటున్నా.. అదెప్పుడో ఎవరికీ క్లారిటీ లేదు. మొత్తానికి ఫ్రెండ్స్ కోసం చేతిలో ఉన్న దర్శకులను వదిలేసారు ఎన్టీఆర్.




