AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun-Mars conjunction: మకర రాశిలో సూర్య కుజల సంయోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..

కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేసిన సమయంలో లేదా ఆ గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో కుజుడు ఫిబ్రవరి 5వ తేదీన ఈ రాశిలోకి అడుగు పెట్టాడు. ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశిలో జరిగింది. సూర్య, కుజుల కలయికకు వేదికగా మకర రాశి కావడంతో ఆదిత్య మంగళ యోగం ఏర్పడింది. ఈ యోగం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభప్రదం కాగా.. మరికొన్ని రాశులకు కష్ట, నష్టాలను కలిగిస్తుంది

Sun-Mars conjunction: మకర రాశిలో సూర్య కుజల సంయోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..
Sun Mars Conjunction
Surya Kala
|

Updated on: Feb 09, 2024 | 2:33 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో మనిషి జీవితం పై గ్రహాలు, నక్షత్రాలు ప్రభావం చూపిస్తాయి. అందుకనే జీవితంలో ఏర్పడే మంచి చెడులు గ్రహాల గమనం పై ఆధార పడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూనే ఉంటుంది. ఇందుకు కొన్ని గ్రహాలు రోజుల సమయం తీసుకుంటే.. సూర్యుడు మాసం, శనీశ్వరుడు రాహువు వంటి గ్రహాలు సంవత్సరాల సమయం  తీసుకుంటాయి. ఇలా గ్రహాల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం వలన  జాతకాలపై ప్రభావం చూపించి వ్యక్తిగత జీవితంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి.

ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేసిన సమయంలో లేదా ఆ గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో కుజుడు ఫిబ్రవరి 5వ తేదీన ఈ రాశిలోకి అడుగు పెట్టాడు. ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశిలో జరిగింది. సూర్య, కుజుల కలయికకు వేదికగా మకర రాశి కావడంతో ఆదిత్య మంగళ యోగం ఏర్పడింది. ఈ యోగం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభప్రదం కాగా.. మరికొన్ని రాశులకు కష్ట, నష్టాలను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య మంగళ యోగం వలన మూడు రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు.. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలను అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. పదోన్నతుల కోసం ఎదురుచూసే వ్యక్తులు శుభవార్త వింటారు. సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఏ పని మొదలు పెట్టినా అదృష్టం కలిసి వచ్చి అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితం సంతోషంగా సాగుతుంది. శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరి.. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఊహించని లాభాలను అందుకుంటారు. స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఖర్చులను అదుపులో ఉంచుకోవడం వలన డబ్బులను ఇతర మార్గాల్లో పెట్టుబడి పెడతారు.

కన్యా రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై ఈ ఆదిత్య మంగళ యోగం మంగళకరంగా ఉండనుంది. వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. దైర్యం పెరిగి.. ఏ పని చేయడానికి కైనా ముందుకు అడుగు వేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి పనులైనా పూర్తి చేస్తారు. అంతేకాదు తమ మాటకారి తనంతో ఎటువంటి వారినైనా ఆకట్టుకుని తమ పనులను పూర్తి చేసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి