Horoscope Today: వారికి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2024): మేష రాశి వారికి ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2024): మేష రాశి వారికి ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. బాగా బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొందరు మిత్రుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉండవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా సానుకూల పరిస్థితులుంటాయి.. మిమ్మల్ని బాగా ఉపయోగించుకునే వారుం టారు. స్నేహితుల మీద కష్టార్జితం వృథా అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో చిన్నా చితకా సమస్యలను పరిష్కరించుకుంటారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. దాంపత్య జీవితం హాయిగా గడిచిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
తలపెట్టిన పనులన్నీ వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. ఏ వ్యవహారమైనా, ఏ ప్రయత్నమైనా వెనువెంటనే నెరవేరే అవకాశం ఉంటుంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దీన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన అంచనాలను దాటుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మిగిలిన విషయాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యయ ప్రయాసలున్నప్పటికీ కొన్ని వ్యవహారా లను పట్టుదలగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపా దన సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. సంతా నానికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబంతో కలిసి విహార యాత్ర చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం కలిసి వస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహా రాల్లో సన్నిహితుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో మాత్రం కొద్దిగా చికాకులు ఉండవచ్చు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. మిమ్మల్ని బాగా ఉపయోగించుకునే వారుంటారు. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. కుటుంబ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే అనుకోకుండా మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలకు ప్రయత్నిస్తే సఫలం అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్క బడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రుల వల్ల కూడా కొద్దిగా నష్టం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అన్ని విషయాల్లోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి.