Zodiac Signs: రాహు కేతువులతో ఆ రాశుల వారికి శుభ ఫలాలు.. వారికి ఆకస్మిక ధనలాభ అవకాశం..!

సాధారణంగా రాహు, కేతువులు స్వతంత్రంగా ఫలితాలనివ్వవు. అవి ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశ్యధిపతి ఫలితాలనిస్తాయి. ఆ రాశ్యధిపతులు బలంగా ఉంటే ఇవి శుభ ఫలితాలనిస్తాయి. ప్రతి రాశిలోనూ ఇవి 18 నెలల పాటు సంచారం చేస్తాయి. ప్రస్తుతం రాహువు గురు గ్రహానికి చెందిన మీన రాశిలోనూ, కేతువు బుధ గ్రహానికి చెందిన కన్యా రాశిలోనూ సంచరించడం వల్ల, రాహువు గురువు ఫలితాలను, కేతువు బుధుడి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Zodiac Signs: రాహు కేతువులతో ఆ రాశుల వారికి శుభ ఫలాలు.. వారికి ఆకస్మిక ధనలాభ అవకాశం..!
Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 09, 2024 | 7:19 PM

సాధారణంగా రాహు, కేతువులు స్వతంత్రంగా ఫలితాలనివ్వవు. అవి ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశ్యధిపతి ఫలితాలనిస్తాయి. ఆ రాశ్యధిపతులు బలంగా ఉంటే ఇవి శుభ ఫలితాలనిస్తాయి. ప్రతి రాశిలోనూ ఇవి 18 నెలల పాటు సంచారం చేస్తాయి. ప్రస్తుతం రాహువు గురు గ్రహానికి చెందిన మీన రాశిలోనూ, కేతువు బుధ గ్రహానికి చెందిన కన్యా రాశిలోనూ సంచరించడం వల్ల, రాహువు గురువు ఫలితాలను, కేతువు బుధుడి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసినప్పుడు గురు, బుధ గ్రహాలు ఏ రాశికి అనుకూలంగా ఉన్నాయో ఆ రాశివారికి ఈ రెండు గ్రహాలు కూడా శుభం కలిగిస్తాయి. ఇవి ఆరు రాశులకు మరో రెండు నెలల పాటు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలకు అవకాశం ఉంటుంది. ఆ రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, కుంభం.

  1. మేషం: ఈ రాశివారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఊహించని శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయి, సంపన్న కుటుంబంతో సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా ఆశించినదాని కంటే మంచి ఉద్యోగానికి ఆఫర్ రావడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో అంచనాలకు మించిన మెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు.
  2. వృషభం: ఈ రాశివారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయ వనరులు పెరుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందు తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, లాభసాటిగా సాగిపోతాయి. విదేశీ సొమ్మును అనుభవించడం కూడా జరుగుతుంది. ఎక్కువగా శుభవార్తలే వింటారు. ఒకటి రెండు ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యనుంచయినా ఉపశమనం లభిస్తుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి విదేశీయాన సంబంధమైన సమస్యలు, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విదేశాల్లో స్థిర నివాసానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం విదేశాల నుంచి ఆఫర్లు, శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  4. తుల: కొన్ని ముఖ్యమైన శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యమైన ఆస్తి వివాదాలు సాను కూలంగా పరిష్కారం అవుతాయి. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు లొంగి ఉంటారు. కొత్త ఉద్యో గావకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన లాభాలు చేకూరుతాయి. సంతానా నికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇష్టమైన తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు.
  5. మకరం: ఈ రాశివారికి ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన, ఇబ్బందికరమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్ట మైన ప్రాంతాలను సందర్శిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
  6. కుంభం: ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయ త్నాలతో పాటు, గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలమీద కూడా దృష్టి పెట్టడం వల్ల విజ యాలు సాధిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అవమానాలు పొందిన చోటే గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  7. ముఖ్యమైన పరిహారాలు: రాహు కేతువులకు సంబంధించిన దోషాలున్నవారు, లేనివారు కూడా తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి లేదా వినాయకుడి ఆలయాలను సందర్శించడం వల్ల కూడా రాహు కేతువుల దుష్ప్రభావం బాగా తగ్గుతుంది. వీలైనప్పుడు లేదా అవకాశం ఉన్నప్పుడు కొద్దిమందికైనా అన్నదానం చేయడం వల్ల కూడా రాహు కేతువుల దోషం బాగా తగ్గుతుంది. సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది.

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక