zodiac signs: ఈ మూడు రాశులపై శని ప్రభావం.. 2025 వరకు బిందాస్..
ఈ క్రమంలోనే కేంద్ర త్రికోన్ రాజ్యయోగం ఏర్పడుతంది. శని తన అసలు త్రికోణ రాశి అయిన కుంభరాశిని జనవరి 2023 నుంచి సంక్రమిస్తున్నాడు. 2025 వరకు అక్కడే ఉన్నాడు. ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశులపై ఉండనుంది. అయితే మరీ ముఖ్యంగా మూడు రాశులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని ప్రభావం ప్రతీ రాశిపై ఉంటుంది. శని రాశి మారిన ప్రతీసారి కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర త్రికోన్ రాజ్యయోగం ఏర్పడుతంది. శని తన అసలు త్రికోణ రాశి అయిన కుంభరాశిని జనవరి 2023 నుంచి సంక్రమిస్తున్నాడు. 2025 వరకు అక్కడే ఉన్నాడు. ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశులపై ఉండనుంది. అయితే మరీ ముఖ్యంగా మూడు రాశులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పండితులు చెబున్నారు. ముఖ్యంగా కుంభం, వృషభం, మిథున రాశుల వారికి ఇది మంచి యోగాన్ని అందించనుందని చెబుతున్నారు. కేంద్ర త్రికోణ రాజయోగం ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం..
కుంభ రాశి..
కేంద్ర త్రికోణ రాజయోగం కుంభ రాశికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశికి చెందిన వివాహ గృహంలో జరుగుతోంది. కాబట్టి ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే, ఈ కాలంలో, కుంభరాశి వారు జీవితంలో చాలా రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసివస్తుంది. ఉద్యోగులకు, ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ పొందొచ్చు. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, కొత్తగా చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు.
వృషభ రాశి..
వృషభ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఈ సమయంలో మీరు పని. వ్యాపారంలో మంచి పురోగతిని పొందవచ్చు. అలాగే ప్రతి పనికి ప్రణాళికలు వేసుకుని దాని అమలుకు కృషి చేయాలి. ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ వనరులు వస్తాయి, డబ్బు సంపాదించాలనే కోరిక పెరుగుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. ఈ సమయంలో మీ తండ్రితో మీ సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
మిధునరాశి..
మిథునరాశికి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడటం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో ఈ యోగం జరుగుతోంది. కాబట్టి, ఈసారి మీరు అదృష్టవంతులు కావచ్చు. ఈ సమయంలో మీరు దేశంలో విదేశాలలో ప్రయాణించవచ్చు. మిధున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కొందరు జ్యోత్యిష్య నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించండి.
మరిన్ని ఆస్ట్రాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




