Akshay Kumar: ‘ఇదొక చారిత్రాత్మక ఘట్టం’.. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన అక్షయ్‌ కుమార్‌

అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే దీని తర్వాత మరో చారిత్రక సంఘటన జరిగింది. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం రూపుదిద్దుకుంది . దీన్ని బుధవారం (ఫిబ్రవరి 14) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Akshay Kumar: 'ఇదొక చారిత్రాత్మక ఘట్టం'.. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన అక్షయ్‌ కుమార్‌
Akshay Kumar
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2024 | 4:17 PM

అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే దీని తర్వాత మరో చారిత్రక సంఘటన జరిగింది. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం రూపుదిద్దుకుంది . దీన్ని బుధవారం (ఫిబ్రవరి 14) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆయనతో పాటు పలువురు ఇండియన్ సెలబ్రిటీలు ఈ మహాక్రతువులో భాగమయ్యారు. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్‌ అక్షయ్ కుమార్‌ కూడా ఉన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో తొలిసారిగా హిందూ దేవాలయాన్ని నిర్మించడం పట్ల అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అబుదాబిలోని స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ అబుదాబి హిందూ ఆలయ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అక్షయ్‌. దీంతో అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఐదు లక్షల మందికి పైగా ఈ ఫోటోను లైక్ చేయడం విశేషం. ఈ ఫోటో గ్లాస్‌లో అక్షయ్ కుమార్ ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ అబుదాబి పర్యటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్షయ్ కుమార్‌తో పాటు దర్శకుడు మధుర్ బండార్కర్, గాయకుడు శంకర్ మహదేవన్, నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా పాల్గొన్నారు. ‘ఇది నా కలలో మాత్రమే చూడగలను. ఆ కల ఇప్పుడు నెరవేరింది. ఇక్కడ ఒక అందమైన హిందూ ఆలయం నిర్మించడం, దీనిని ప్రధాని ప్రారంభించడం చాలా గొప్ప విషయం. యూఏఈ ప్రభుత్వం మన సంస్కృతితో చేతులు కలపడం గొప్ప విషయం’ అని శంకర్ మహదేవన్ తెలిపారు. హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఇప్పటి వరకు యూఏఈ అంటే బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం హైటెక్ భవనాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు హిందూ దేవాలయం రూపంలో ఒక కొత్త సాంస్కృతిక అధ్యాయం ప్రారంభమైంది. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని నమ్ముతున్నాను. యుఎఇని సందర్శించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల తరపున, యూఏఈ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోడీ ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి

అక్షయ్ కుమార్ ట్వీట్.,.

అబుదాబిలోని మొదటి హిందూ దేవాలయం.. వీడియో ఇదుగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.