Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో నన్ను కాపాడింది అదే.. చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌

కొన్నినెలల క్రితం సాయి ధరమ్‌ తేజ్‌ జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. బైక్‌ ప్రమాదంలో ఈ మెగా హీరో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే గడిపాడు. ఇప్పటికీ కూడా ఈ బైక్ యాక్సిడెంట్ నుంచి తేజ్ కోలుకోలేదని తెలుస్తోంది. ఆయన మాటలు, గొంతు విన్నా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది.

Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో నన్ను కాపాడింది అదే..  చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌
Sai Dharam Tej
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2024 | 3:35 PM

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నినెలల క్రితం సాయి ధరమ్‌ తేజ్‌ జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. బైక్‌ ప్రమాదంలో ఈ మెగా హీరో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే గడిపాడు. ఇప్పటికీ కూడా ఈ బైక్ యాక్సిడెంట్ నుంచి తేజ్ కోలుకోలేదని తెలుస్తోంది. ఆయన మాటలు, గొంతు విన్నా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది. బైక్‌ ప్రమాదం తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా మారిపోయాడు. రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఈవెంట్లలో తరచూ కనిపిస్తున్నాడు. ట్రాఫిక్‌ రూల్స్ గురించి అవగామన కల్పిస్తున్నాడు. జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో తాజాగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్‌) ఆధ్వ‌ర్యంలో బంజ‌రా హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేష‌న‌ల్ సోసైటీ ఆడిటోరియంలో ర‌హ‌దారి భ‌ద్ర‌తా చైత‌న్య స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా సాయిధ‌ర‌మ్ తేజ్‌ హాజరయ్యాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన తేజ్ తన బైక్‌ ప్రమాద సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు.

‘ఇది నాకు రెండో జీవితం. నేను రోడ్డు ప్ర‌మాదం నుంచి బ‌య‌ప‌డ‌టానికి హెల్మెట్ కార‌ణమైంది. అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్ష‌కుల ఆశ్సీస్సుల‌తో ఈ రోజు మీ ముందు ఇలా నిల‌బ‌డ్డానికి కార‌ణ‌మ‌దే. టూవీల‌ర్ డ్రైవ్ చేసే వాళ్లంతా త‌ప్ప‌కుండా హెల్మెట్‌ను ధ‌రించండి. అలాగే కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్డ్‌లు విధిగా ధ‌రించండి. అంద‌రూ ట్రాఫిక్స్ రూల్స్ పాటించండి. మ‌ద్యం తాగిన‌ప్పుడు డ్రైవింగ్ చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌ం. అంద‌రూ ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రిస్తూ, ట్రాఫిక్స్ నిబంధ‌న‌లు పాటిద్దాం’ అంటూ తన స్పీచ్‌లో చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్స్ తర్వాత గాంజా శంకర్‌ గా కనిపించనున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. సంపతి నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!