Sriram – Raviteja: పాపం! ఈ హీరో బ్యాడ్‌లక్.. రవితేజకు గుడ్ లక్ అయింది..
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఈగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు రవితేజ. సింధూరం సినిమాతో హీరోగా మారారు.
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఈగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు రవితేజ. సింధూరం సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత ఇడియట్తో నిలదొక్కుకున్నాడు. ఇక రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ ఒకటి. డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన ఈ మూవీ 2003లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమాలో రవితేజ కంటే ముందు మరో టాలీవుడ్ హీరో చేయాల్సిందట. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఈ మూవీని వదలుకున్నారట.
ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా ?..అతడే హీరో శ్రీరామ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ లో వదులుకున్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. రైటర్ కోన వెంకట్ తన దగ్గరకు రెండు కథలను తీసుకొచ్చారని.. అందులో ఒకరికి ఒకరు.. అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి అని చెప్పారు. ఈ రెండు సినిమాలకు సైన్ చేశానని.. అప్పటికే తనను హీరోగా ప్రకటించారని కూడా అన్నారు. కానీ అదే సమయంలో ‘మనసెల్లాం’ అనే తమిళ సినిమా చేస్తూ ఆ షూటింగ్ లో గాయపడ్డానని.. దీంతో కొన్ని రోజులు యాక్షన్ సన్నివేశాలు చేయొద్దని డాక్టర్లు సూచించారని.. అయితే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో క్లైమాక్స్ లో ఫైటింగ్ సీన్ ఉంటుందని.. తన కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఆ సన్నివేశాలను మార్చడం ఇష్టం లేదని.. అలా చేస్తే సినిమాకు న్యాయం జరగదు అనిపించి ఆ చిత్రాన్ని వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామ్ స్థానంలోకి రవితేజ వచ్చారని.. అప్పుడు రవితేజ ఫోన్ చేసి మాట్లాడి.. తన పరిస్థితి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

