AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ఎయిర్ పోర్టులో షారుక్ చేతిని ముద్దాడిన అభిమాని.. కింగ్ ఖాన్‌ రియాక్షన్‌ ఏంటంటే? వీడియో

సెలబ్రిటీలు పబ్లిక్‌గా కనిపించినప్పుడల్లా వారిని కలవాలని, ఫొటోలు, దిగాలని, సెల్ఫీలు తీసుకోవాలని అభిమానులు ముచ్చటపడుతుంటారు. సెలబ్రిటీలు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలేదు. ఓపిక ఉన్నంత సేపు ఫ్యాన్స్‌ తో ఫొటోలు, సెల్ఫీలు దిగుతారు. అయితే ఒక్కోసారి మూడ్ సరిగా లేకపోవడంతో ముఖం చాటేస్తారు.

Shah Rukh Khan: ఎయిర్ పోర్టులో షారుక్ చేతిని ముద్దాడిన అభిమాని.. కింగ్ ఖాన్‌ రియాక్షన్‌ ఏంటంటే? వీడియో
Shah Rukh Khan
Basha Shek
|

Updated on: Feb 14, 2024 | 3:05 PM

Share

సెలబ్రిటీలు పబ్లిక్‌గా కనిపించినప్పుడల్లా వారిని కలవాలని, ఫొటోలు, దిగాలని, సెల్ఫీలు తీసుకోవాలని అభిమానులు ముచ్చటపడుతుంటారు. సెలబ్రిటీలు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలేదు. ఓపిక ఉన్నంత సేపు ఫ్యాన్స్‌ తో ఫొటోలు, సెల్ఫీలు దిగుతారు. అయితే ఒక్కోసారి మూడ్ సరిగా లేకపోవడంతో ముఖం చాటేసి వదిలేస్తారు. కొందరు స్టార్‌ హీరోలు తమ అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఓ అభిమాని షారూఖ్‌ను ముద్దుపెట్టుకున్నాడు . దీనిపై షారుక్ ఖాన్ మాత్రం చాలా కూల్ గా స్పందించాడు. మంగళవారం (ఫిబ్రవరి 13) సాయంత్రం షారుక్ ఖాన్ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులు కింగ్‌ ఖాన్‌ ఫోటోల కోసం ఎగబడ్డారు. షారుక్‌ కూడా ఎంతో ఓపికగా అందరితో చేయి కలుపుతూ ముందుకు వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న ఓ వీరాభిమాని షారుక్‌ చేతిని ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఇక్కడే అందరి మనసులు గెల్చుకున్నాడు బాలీవుడ్‌ బాద్‌ షా. సదరు అభిమాని చర్య పట్ల ఎంతో సానుకూలంగా, కూల్ గా స్పందించాడు. చిరునవ్వులు చిందిస్తూ ముందుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. షారుక్‌ చేతిని ముద్దుపెట్టుకున్న వ్యక్తిని అందరూ లక్కీ అని పేరుతో పిలుస్తుంటారు. . ఈ వీడియోకు అన్ని చోట్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. షారుఖ్ అభిమానులు దీన్ని వైరల్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కూల్ గా ప్రవర్తించాడని పలువురు ప్రశంసించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎనిమిది మంది భారతీయ నేవీ సిబ్బందిని ఇటీవల ఖతార్ విడుదల చేసింది. దీని వెనుక షారుక్ ఖాన్ పాత్ర ఉందనే వార్తలు వచ్చాయి. షారుక్ ఇటీవల అక్కడ పర్యటించడమే ఈ వార్తలకు ప్రధాన కారణం. అయితే ఇందులో షారుఖ్‌ ఖాన్‌ పాత్ర లేదని ఆయన బృందం స్పష్టం చేసింది. ఇందుకు భారత అధికారులే కారణమని సమాచారం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ తో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు షారుఖ్ ఖాన్. అతను నటించిన’పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ బ్లాక్ బస్టర్స్‌ మూవీస్‌ గా నిలిచాయి. షారుక్‌ తదుపరి సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

షారుక్ నిర్మాతగా భక్షక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.