Valentine’s Day: 20 ఏళ్ల క్రితం రితేశ్‌ ఇచ్చిన రోజా పువ్వు జెన్నీకి ఎంత స్పెషలో తెలుసా? ఇప్పటికీ అలాగే..

జెనీలియా డిసౌజా తొలి చిత్రం 'తుజే మేరీ కసమ్' 2003లో విడుదలైంది. ఆ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించాడు. రితేష్‌కి ఇదే మొదటి సినిమా. రితేష్ ప్రముఖ రాజకీయ నాయకుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. రితేష్ రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో అతడికి ఈగో ఉండవచ్చని జెనీలియా భావించిందట.

Valentine's Day: 20 ఏళ్ల క్రితం రితేశ్‌ ఇచ్చిన రోజా పువ్వు జెన్నీకి ఎంత స్పెషలో తెలుసా? ఇప్పటికీ అలాగే..
Genelia D'souza, Riteish Deshmukh
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2024 | 1:40 PM

ప్రముఖ నటి జెనీలియా డిసౌజా చాలా మందికి రోల్ మోడల్. ఆన్‌ స్క్రీన్‌ అయినా.. ఆఫ్ స్క్రీన్‌ అయినా ఆమెను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారు. అన్నట్లు జెనీలియాకు కూడా ఒక అందమైన ప్రేమకథ ఉందట. అదే నండి ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ తో. వీరి ప్రేమకథ 2003లో మొదలైంది. ఆ సందర్భంగా రితీష్ దేశ్‌ముఖ్ ఇచ్చిన గులాబీని జెనీలియా ఇప్పటికీ అలాగే ఉంచుకుందట . తమ ప్రేమకు గుర్తుగా. ఈరోజు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే . ఈ సందర్భంగా అభిమానులు సెలబ్రిటీల ప్రేమ-పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. జెనీలియా-రితేష్ ల లవ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జెనీలియా డిసౌజా తొలి చిత్రం ‘తుజే మేరీ కసమ్’ 2003లో విడుదలైంది. ఆ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించాడు. రితేష్‌కి ఇదే మొదటి సినిమా. రితేష్ ప్రముఖ రాజకీయ నాయకుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. రితేష్ రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో అతడికి ఈగో ఉండవచ్చని జెనీలియా భావించిందట. కానీ రితేష్ చాలా సింపుల్‌. అందుకే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రితేష్ తన ప్రేమను తెలుపుతూ ఆ రోజుల్లో జెనీలియాకు ఎర్ర గులాబీ పువ్వు ఇచ్చాడుట. రితేశ్‌పై ప్రేమకు గుర్తుగా ఇప్పటికీ ఆ రెడ్‌ రోజ్‌ను అలాగే ఉంచుకుందట జెన్నీ.

జూన్ 2022లో, జెనీలియా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్‌ను నిర్వహించింది. రితేష్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని ఓ అభిమాని అడిగాడు. రెండు దశాబ్దాల నాటి గులాబీ పువ్వు అని సమాధానమిచ్చింది జెనీలియా. ఇదే విషయమై ఫిబ్రవరి 2023లో, రితేష్ దేశ్‌ముఖ్ మాట్లాడాడు. ‘నేను ఆమెకు గులాబీని ఇచ్చాను. సుమారు 20 ఏళ్లయింది. ఇప్పటికీ అలాగే ఉంచుకున్నాం’ అని రితీష్ దేశ్‌ముఖ్ గర్వంగా చెప్పుకొచ్చాడు. దాదాపు 9 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. జెనీలియా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

జెనీలియాతో రితేశ్ దేశ్ ముఖ్

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

జెనీలియా, రితేశ్ దేశ్ ముఖ్ ల డ్యాన్స్..

View this post on Instagram

A post shared by Riteish Deshmukh (@riteishd)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!