Rajadhani Files: ‘రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్ ఆపాలంటూ వైసీపీ పిటిషన్‌.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రాజకీయం రంజుగా సాగుతోంది. ఇప్పటికే యాత్ర 2 సినిమా కాక రేపుతుంటే మరో రెండు రోజుల్లో రామ్ గోపాల్‌ వర్మ వ్యూహం రిలీజ్‌ కానుంది. అయితే దీనికన్నా ముందే మరో పొలిటికల్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రాజధాని ఫైల్స్‌. ఏపీ రాజధాని కథాంశంగా భాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు.

Rajadhani Files: 'రాజధాని ఫైల్స్' సినిమా రిలీజ్ ఆపాలంటూ వైసీపీ పిటిషన్‌.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
Rajadhani Files Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2024 | 10:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రాజకీయం రంజుగా సాగుతోంది. ఇప్పటికే యాత్ర 2 సినిమా కాక రేపుతుంటే మరో రెండు రోజుల్లో రామ్ గోపాల్‌ వర్మ వ్యూహం రిలీజ్‌ కానుంది. అయితే దీనికన్నా ముందే మరో పొలిటికల్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రాజధాని ఫైల్స్‌. ఏపీ రాజధాని కథాంశంగా భాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే అలనాటి అందాల తార వాణీ విశ్వనాథ్‌ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాజధాని ఫైల్స్‌ గురువారం (ఫిబ్రవరి 15)న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే రాజధాని ఫైల్స్‌ సినిమాను ఆపాలంటూ వైసీపీ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు, సినిమా నిర్మాతలను తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. రాజదాని ఫైల్స్ సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ. ఈ సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ. సీఎం జగన్ మోహన్ రెడ్డినీ అవమానించేలా రాజధాని ఫైల్స్ సినిమా చిత్రీకరించారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.

దీనికి స్పందించిన సెన్సార్‌ బోర్డు..సినిమాను రెండుసార్లు వీక్షించి తమ అభ్యంతరాలను నిలువరించిన తరువాతే సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చామని తెలిపింది. అలాగే సినిమాలో ఎవరిని అవమనించలేదని లేదని కల్పిత పాత్రలన్న నిర్మాతల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనల విన్న ఏపీ హై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఇవి కూడా చదవండి

రేపే థియేటర్లలోకి రాజధాని ఫైల్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..