- Telugu News Photo Gallery Side Effects Of Cabbage: Surprising Disadvantages of Eating Too Much Cabbage
Cabbage Side Effects: క్యాబేజీ ఆరోగ్యానికి మంచిదే.. అయితే వీరు మాత్రం తింటే వ్యాధులు కొని తెచ్చుకున్నట్లే..
మనిషి శరీర నిర్మాణం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. కనుకనే పూర్వకాలంలో కాలానికి అనుగుణంగా ఆహార నియమాలను పెట్టారు. ఏ కాలంలో దొరికే కూరగాయలను, పండ్లను తినే ఆహారం చేర్చుకోవాలని సూచించారు. అదే విధంగా శీతాకాలంలో కూరగాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొంతమంది క్యాబేజీని తినే ఆహారంలో చేర్చుకుంటారు. సలాడ్, కూర, క్యాబేజీ రైస్ వంటి వివిధ పదార్ధాలలో క్యాబేజీ చేర్చి వండు తారు. వాస్తవానికి క్యాబేజీ తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. అదే సమయంలో కొంతమంది క్యాబేజీని తినడం వలన అనేక ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపధ్యంలో క్యాబేజీని మొత్తానికి దూరంగా పెట్టేబదులు క్యాబేజీ రసం తీసుకోవచ్చు. క్యాబేజీని అస్సలు తినాలా అని ఆలోచిస్తున్నారా ?
Updated on: Feb 15, 2024 | 4:29 PM

చలికాలం చివరిలో ఉన్నాం.. ఇపుడు కూడా క్యాబేజీని వండుతున్నారు. దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే క్యాబేజీ అపానవాయువుకు కారణమవుతుంది. క్యాబేజీ, బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు కడుపులో గ్యాస్‌ను కలిగిస్తాయి. అయితే అసలు క్యాబేజీని తినాలా? వద్దా అని ఆలోచిస్తున్నారా? ఇది మీకోసమే..

ఎక్కువమంది రకరకాల కూరగాయలను దాదాపు ప్రతిరోజూ వినియోగిస్తారు. ఇలా చేయడం వలన శరీరానికి మంచిది కదా.. లేదా ఏమైనా అనరోగ్యమా అనే విషయం పై పెద్దగా దృష్టి పెట్టరు. తత్ఫలితంగా ఏ కూరగాయలు తమ శరీరానికి హానికరమో చాలా మందికి తెలియదు.

క్యాబేజీ అదే జాబితాలో ఉంది. చలికాలం అంతా ఈ కూరగాయలను తినండి. ఇప్పుడు శీతాకాలంకు గుడ్ బై చెప్పి.. వేసవి కాలానికి వెల్కం చెప్పే సమయంలో ఉన్నాం.. కనుక ఇప్పుడు క్యాబేజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటే ఒక్కసారి ఆలోచించండి..

క్యాబేజీలో ఫాస్పరస్, కాల్షియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు వివిధ ఎముక సమస్యలను తొలగిస్తాయి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాబేజీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత ఎముకల సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగాక్యాబేజీలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

Cabbage

ఫలితంగా గ్యాస్ట్రిటిస్ పెరుగుతుంది. క్యాబేజీ అపానవాయువుకు కారణమవుతుంది. క్యాబేజీ, బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు కడుపులో గ్యాస్‌ను కలిగిస్తాయి.

ఏది ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటప్పుడు ముందుగా కొద్ది మొత్తంలో తినడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తుందో లేదో చూడండి. సమస్య ఉంటే క్యాబేజీని తినకపోవడమే మంచిది.

అయితే క్యాబేజీ బదులు.. క్యాబేజీ రసం తీసుకుంటే అజీర్ణం, అపానవాయువు, గుండెల్లో మంట, గ్యాస్, మలబద్ధకం నుండి అల్సర్ల వరకు కడుపు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది. డైటరీ ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ కూరగాయ మధుమేహం నియంత్రలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే దీనిని తినే ఆహారంలో చేర్చుకోండి. అయితే గౌట్ ఆర్థరైటిస్, హైపో థైరాయిడ్ వంటి శారీరక సమస్యలున్నప్పుడు క్యాబేజీని తినకపోవడమే మంచిది.





























